ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజలకు సంక్షేమాన్ని వివరించడమే లక్ష్యం

ABN, Publish Date - Sep 21 , 2024 | 11:59 PM

కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించడమే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్య క్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు.

శ్రీకాకుళం కలెక్టరేట్‌: నగరంలోని మహాలక్ష్మి నగర్‌ కాలనీలో వంద రోజుల పాలన కరపత్రాలను అందజేస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌: కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించడమే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్య క్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. శ్రీకా కుళం నగరపాలక సంస్థ 24వ డివిజన్‌ మహాలక్ష్మి నగర్‌ కాలనీలో మునిసి పల్‌ కమిషనర్‌ ప్రసాదరావుతో కలిసి శనివారం ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డా.సుధీర్‌, టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌ పాల్గొన్నారు.

వైసీపీ హయాంలో రాష్ట్రంలో సంక్షోభం: శంకర్‌

శ్రీకాకుళం రూరల్‌: ఐదేళ్ల వైసీపీ హయాంలో రాష్ట్రం సంక్షోభంలో మునిగిపోయిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. లంకాంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. వంద రోజుల్లో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పీశ హరి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎంజీఆర్‌

దబ్బపాడు(ఎల్‌.ఎన్‌.పేట): రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే కూటమి ప్రభు త్వ లక్ష్యమని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. దబ్బ పాడులో శనివారం ‘ఇది మంచి ప్రభుత్వం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక్కొక్కటి అమలు చేస్తున్నారన్నారు. టెక్కలి ఆర్డీవో సుదర్శన దొర, ఎంపీడీవో ఆర్‌.కాళీప్రసాదరావు, తహసీల్దార్‌ వైవీపద్మా వతి, టీడీపీ నేతలు ఎం.మనోహర్‌ నాయుడు, కె.చిరంజీవి, కె.కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.

సమాంతరంగా సంక్షేమం-అభివృద్ధి: శిరీష

హరిపురం: కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లోనే సంక్షేమం, అభి వృద్ధి సమాంతరంగా అమలు చేస్తోందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నా రు. ఏజెన్సీ ప్రాతమైన బుడార్సింగి, పాతకోట, గుడ్యాల గ్రామాల్లో మండల ప్రత్యేకాధికారి బీవీ రమణమూర్తి ఆధ్వర్యంలో శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎన్ని కష్టాలు ఎదురైనా సామాజిక పింఛన్ల మొత్తాన్ని పెంచడంతో పాటు మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, ల్యాండ్‌ టైట్లిం గ్‌ యాక్ట్‌ రద్దు వంటి సాహసోపేత నిర్ణయాలను కూటమి ప్రభు త్వం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో తీసుకుందన్నారు. మండలంలోని సమస్యలను దశల వారీగా పరిష్కరి స్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బావన దుర్యో ధన, లబ్బ రుద్రయ్య, రట్టి లింగరాజు, దాసరి తాతారావు, తమిరి భాస్కరరావు, ఎంపీడీవో తిరుమలరావు, తహసీల్దార్‌ కృష్ణమూర్తి పాల్గొన్నారు.

పేదరికం లేని రాష్ట్రమే లక్ష్యం: బగ్గు

జలుమూరు (సారవకోట): పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. గోవర్థనపురంలో శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం వంద రోజుల్లో చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ.. గడచిన ఐదేళ్లలో పాలన ఇరవై ఏళ్లు వెనక్కు వెళ్లిపోయింద న్నారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో గణనీయమైన మార్పులు సాధించి రాష్ట్రాభివృద్ధి పురోగతి వైపు సాగుతోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, నేతలు కత్తిరి వెంకటరమణ, ధర్మాన తేజకుమార్‌, సురవరపు తిరుపతిరావు, సాధు చిన్నికృష్ణంనాయుడు, పట్ట ఉమారావు, డి.జయరాం, జనసేన నాయకులు బలగ ప్రవీణ్‌కుమార్‌, పి.నందకిశోర్‌ పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి: కలమట

కొత్తూరు: మాతల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ మూర్తి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనను వివరిం చారు. అనంతరం ఇళ్లకు స్టిక్కర్లను అంటించారు. కూటమి ప్రభుత్వం తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. కూటమి నేతలు పాల్గొన్నారు.

లడ్డూ కలుషితం పాపం జగన్‌దే: రవికుమార్‌

పొందూరు: తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కలుషితం చేసి అపవిత్రం చేసి న పాపం మాజీ సీఎం జగన్‌దేనని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమా ర్‌ ఆరోపించారు. లోలుగులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం శని వారం నిర్వహించారు. శుద్ధమైన నెయ్యితో చేయాల్సిన ప్రసాదాన్ని కేవలం కమీషన్ల కక్కుర్తితో నాణ్యతలేని నెయ్యిని వాడారన్నారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం, పీఎంలను కోరతానన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రమేష్‌, ఎంపీడీవో హరిహరరావు, టీడీపీ నేతలు సీహెచ్‌ రామ్మోహన్‌, కూన సత్యారావు, ఎ.రాము, బి.శంకర భాస్కర్‌, జనసేన, బీజేపీ నేతలు పేడాడ రామ్మోహన్‌, ఎల్‌.సింహాచలం పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో విజయం: ఎన్‌ఈఆర్‌

లావేరు:కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విజయవంతమైందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు. అదపాకలో ఇది మంచి ప్రభు త్వం కార్యక్రమంలో భాగంగా కరపత్రాలను ఇంటింటికీ వెళ్లి అందజేశారు. వందరోజుల్లో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకుడు ముప్పిడి సురేష్‌, జనసేన నాయకులు విశ్వక్షేన్‌, మాజీ ఎంపీపీ మీసాల వెంకటరమణ, తోటయ్యదొర, కిల్లారి నాగేశ్వరరావు, నడి మింటి చార్లెస్‌, లంకలపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

వైసీపీ రాష్ట్రాన్ని నాశనం చేసింది: అశోక్‌

కవిటి: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బి.అశోక్‌ ఆరోపించారు. రాజపురంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సూర్యనారాయణ రెడ్డి, నాయకులు ఎస్‌వీ రమణ, పి.కృష్ణారావు, బి.రమేష్‌, వి.రంగారావు, బి.సురేష్‌, బి.తిరుమల, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 11:59 PM