రామలింగేశ్వరుని తాకిన సూర్యకిరణాలు
ABN, Publish Date - Sep 29 , 2024 | 11:51 PM
బొరివంకలోని శ్రీరామలింగేశ్వరునికి ఆదివారం ఉదయం 6.10 గంటలకు సూర్యకిరణాలు తాకాయి.
రామలింగేశ్వరునికి సూర్యకిరణాలు తాకిన దృశ్యం:
కవిటి: బొరివంకలోని శ్రీరామలింగేశ్వరునికి ఆదివారం ఉదయం 6.10 గంటలకు సూర్యకిరణాలు తాకాయి. గర్భగుడిలోని ఉత్సవమూర్తిపై ఐదు నిమిషాల పాటు కిరణాలు ప్రసరించాయి. ఆలయం ఎదురుగా ఉన్న కొబ్బరి చెట్ల కమ్మల నీడను చీల్చుకుని సూర్యకిరణాలు గర్భగుడిని తాకడంతో భక్తులు ఆనందం వ్యక్తంచేశారు. ఏటా సెప్టెంబరులో సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయని అర్చకులు సురేష్‌కుమార్ రౌళో తెలిపారు.
Updated Date - Sep 30 , 2024 | 04:34 PM