బీఆర్‌ఏయూ వీసీగా ప్రొఫెసర్ రజని
ABN, Publish Date - Jan 18 , 2024 | 12:05 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీగా ఆంధ్రా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ కేఆర్ రజనిని నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె కృష్ణా జిల్లా తిరువూరు మండలం మల్లెల గ్రామం వాసి.
ఎచ్చెర్ల, జనవరి 17: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీగా ఆంధ్రా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ కేఆర్ రజనిని నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె కృష్ణా జిల్లా తిరువూరు మండలం మల్లెల గ్రామం వాసి. ఈమె ఏయూలోని ఫిలాసపీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా 1994లో చేరారు. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్‌గా 2000- 2008వరకు, ప్రొఫెసర్‌గా 2008-2019 వరకు పనిచేసి పదవీ విరమణ చేశారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలాసిపికల్ రీసెర్చ్ (ఐసీపీఆర్)కు సీనియర్ ఫెలోగా, జేఎన్‌టీయూ (విజయనగరం) పాలకమండలి సభ్యురాలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈమె గైడెన్స్‌లో 18 మంది పీహెచ్‌డీ అవార్డు అందుకోగా, మరో 8 మంది రీసెర్చ్ చేస్తున్నారు. 2008లో ఏర్పాటైన ఈ వర్సిటీకి ఇప్పటి వరకు నలుగురు రెగ్యులర్ వీసీలు పనిచేశారు. కేఆర్ రజని బీఆర్‌ఏయూకు ఐదో వీసీగా నియమితులయ్యారు. అంబేడ్కర్ వర్సిటీకి ఇప్పటి వరకు ప్రొఫెసర్ ఎస్వీ సుధాకర్, ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్, ప్రొఫెసర్ కూన రాంజీ, ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు రెగ్యులర్ వీసీలుగా పనిచేశారు.
Updated Date - Jan 18 , 2024 | 12:05 AM