బిల్లులు కాక.. పనులు జరగక
ABN, Publish Date - Oct 27 , 2024 | 11:17 PM
మండలంలోని శాలిహుండం కొండపక్కన నిర్మిస్తున్న గ్రామసచివాలయం భవనానికి సంబంధించిన బిల్లులు కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. గతప్రభుత్వహయాంలో ఇక్కడ సచివాలయం నిర్మాణానికి నిధులు మంజూర య్యాయి.
గార, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మండలంలోని శాలిహుండం కొండపక్కన నిర్మిస్తున్న గ్రామసచివాలయం భవనానికి సంబంధించిన బిల్లులు కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. గతప్రభుత్వహయాంలో ఇక్కడ సచివాలయం నిర్మాణానికి నిధులు మంజూర య్యాయి. రూ.40లక్షలు నిధులతో భవనం నిర్మాణం చేపట్టారు. అయితే కాంట్రాక్టరుకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం తదితర కారణాల వల్ల పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో భవనం చుట్టూ పిచ్చిమొ క్కలు పెరిగిపోయాయి. ఈభవనం నిర్మాణం పూర్తి కాకపోవడంతో పాత పంచాయతీ భవనం సచివాలయం నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం సచివాలయం నిర్మాణం పూర్తిచేసి అందు బాటులోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు. కాగా అర్ధాంతరంగా నిలిచిపోయిన సచివాలయం భవనం పూర్తి చేయడానికి ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు చర్యలు తీసు కుంటామని మండల ఇంజనీరింగ్ అధికారి పి.గోవిందరావు తెలిపారు.
Updated Date - Oct 27 , 2024 | 11:17 PM