వివాహిత ఆత్మహత్య
ABN, Publish Date - Nov 25 , 2024 | 11:28 PM
పలాస మండలం ఈదురా పల్లి గ్రామంలో సోమవారం ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వర కట్నం వేధింపులతోనే తన కుమార్తెను చంపేశారని ఆమె తల్లిదండ్రు లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు చేరు కొని నిరసన తెలిపారు.
వరకట్న వేధింపులే కారణం: తల్లిదండ్రులు
పలాస, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): పలాస మండలం ఈదురా పల్లి గ్రామంలో సోమవారం ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వర కట్నం వేధింపులతోనే తన కుమార్తెను చంపేశారని ఆమె తల్లిదండ్రు లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు చేరు కొని నిరసన తెలిపారు. వారం రోజుల వ్యవ ధిలో ఇద్దరు వివాహితలు ఇదే గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపు తోంది. కాశీబుగ్గ సీఐ డి.మోహనరావు తెలి పిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెం దిన పైల వినోద్ ఢిల్లీలోని మిలటరీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయనకు మెళి యాపుట్టి మండలం టకోయి గ్రామానికి చెందిన పల్లి సంపతిరావు, ధనలక్ష్మి చిన్న కుమార్తె నీరజాక్షి (19)తో ఆరు నెలల కిందట వివాహమైంది. అనంతరం ఢిల్లీలో కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల కిందట గ్రామం లో కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించేందుకు ఇద్దరూ వచ్చారు. సోమవారం సాయంత్రం భర్త వేరే గదిలో నిద్రిస్తుండగా ఆమె ఇంటి కొక్కేనికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి సీఐ చేరుకొని మృతికి కారణాలు అడిగి తెలుసు కున్నారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టు మార్టం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
భర్త, అత్తవారింటి వేధింపులతోనే..
వివాహ సమయంలో రూ.10 లక్షల కట్నం ఇచ్చేందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు. రూ.5 లక్షలతో పాటు బంగారం, ఇతర కానుకలు అల్లుడికి ఇచ్చా రు. మిగిలిన రూ5 లక్షలు తీసుకురావాలని వినోద్‌తో పాటు వారి తల్లి దండ్రులు వేధించారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మీ కుమార్తె ఉరి పోసుకొని ఆత్మ హత్యకు పాల్పడిందని ఫోన్ చేశారని, ఇంటికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కట్నం వ్యవహారంతోనే తన కుమార్తె మృతి చెందిందని, న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్‌కు చేరు కున్న టకోయి గ్రామస్థులు కూడా మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - Nov 25 , 2024 | 11:28 PM