వైసీపీ నుంచి టీడీపీలో చేరిక
ABN, Publish Date - Jan 18 , 2024 | 12:05 AM
నియోజకవర్గంలో పలు పంచాయతీల వైసీపీ వార్డు మెంబర్లు బుధవారం టీడీపీలో చేరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నా యుడు నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో వారికి పార్టీ కండువావేసి పార్టీలోకి ఆహ్వానించారు.
కోటబొమ్మాళి/టెక్కలి, జనవరి 17: నియోజకవర్గంలో పలు పంచాయతీల వైసీపీ వార్డు మెంబర్లు బుధవారం టీడీపీలో చేరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నా యుడు నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో వారికి పార్టీ కండువావేసి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో లఖందిడ్డి పంచాయతీ మూలపేట గ్రామానికి చెందిన వార్డు మెంబరు మూల సింహాచలం, బమ్మిడి ఉత్తరరావు, బమ్మిడి కృష్ణ, గురువెల్లి చలపతితో పాటు 50 కుటుంబాలు ఉన్నాయి. అలాగే కొత్తపల్లి పంచాయతీ గ్రామ వలంటీరు వాన ప్రవీణ్, వార్డు మెంబర్ వెలమల వెంకటరావు కూడా టీడీపీలో చేరా రు. నందిగాం మండలం కాపు తెంబూరు పంచాయతీ నుంచి వైసీపీ నాయకులు మాలపల్లి నారాయణరావు, మలగాం లక్ష్మీకాంతం, మాలపల్లి లక్ష్మణరావు, తేజసర్వరరావు, కుమ్మరి తిమ్మయ్యతో పాటు 50 కుటుంబాల వారు టీడీపీలో చేరారు.
Updated Date - Jan 18 , 2024 | 12:05 AM