ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఈశ్వరరావు

ABN, Publish Date - Mar 28 , 2024 | 12:05 AM

జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కిలారి ఈశ్వరరావు ఎన్నికయ్యారు.

అసోసియేషన్‌ సభ్యులను అభినందిస్తున్న న్యాయవాదులు

గుజరాతీపేట: జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కిలారి ఈశ్వరరావు ఎన్నికయ్యారు. త్రిముఖ పోటీ హోరాహోరీగా జరగగా ఈశ్వరరావు 63 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జిల్లా కోర్టు సముదాయంలో బుధవారం పోలింగ్‌ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సాగింది. బార్‌ సభ్యులు 608 ఓట్లకు గాను 493 మంది ఓటును వినియోగించుకున్నారు. ఇందులో రెండు ఓట్లు ఇన్‌వాలీడ్‌గా ప్రకటించారు. అధ్యక్షుడి స్థానానికి ముగ్గురు సీనియర్‌ న్యాయవాదులు కిలారి ఈశ్వరరావు, కూన రాజారావు, ఎన్ని సూర్యారావు పోటీపడగా అత్యధిక ఓట్లతో ఈశ్వరరావు విజయం సాధించారు. అదేవిధంగా జాయింట్‌ సెక్రటరీ కోసం ఇద్దరు పోటీపడగా పీస చంద్రశేఖర్‌ గెలుపొందారు. ఉపాధ్యక్షులుగా మరిచెర్ల అన్నంనాయుడు, ప్రధాన కార్యదర్శిగా యగల్ల ప్రసన్నకుమార్‌, ట్రెజరర్‌గా విరోధి శ్రీనివాసరావు, లైబ్రరీ సెక్రటరీగా పాతినవలస రామారావు, స్పోర్ట్స్‌ సెక్రటరీగా కారి అప్పారావు, లేడీ రిప్రజెంటేటివ్‌గా దవళ అమృత ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా న్యాయవాదులు కంచరాన నాగభూషణరావు, సహాయ ఎన్నికల అధికారులుగా అరికతోట కృష్ణంరాజు, మజ్జి సంపత్‌కుమార్‌, బీఎస్‌ శ్రీనివాసరావు, పీస జయరాం, అరంగి అప్పలరాజు, అసదుల్లా తదితరులు వ్యవహరించారు.

Updated Date - Mar 28 , 2024 | 12:05 AM

Advertising
Advertising