ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బెదిరింపులకు పాల్పడడం విచారకరం

ABN, Publish Date - Jan 18 , 2024 | 11:52 PM

ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్‌ నోటీసులకు అంగన్‌వాడీ కార్యకర్తలు సమాధానమిచ్చారు. హామీలు అమలు చేయాలని కోరుతూ సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలకు ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

అధికారులతో మాట్లాడుతున్న అంగన్‌వాడీలు

- షోకాజ్‌ నోటీసులకు సమాధానమిచ్చిన అంగన్‌వాడీలు

అరసవల్లి, జనవరి 18: ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్‌ నోటీసులకు అంగన్‌వాడీ కార్యకర్తలు సమాధానమిచ్చారు. హామీలు అమలు చేయాలని కోరుతూ సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలకు ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం గుజరాతీపేట నుంచి ఐసీడీఎస్‌ కార్యాలయం వరకు అంగన్‌వాడీలు ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.ఆదినారాయణమూర్తి, అంగన్‌వాడీ జిల్లా అధ్యక్షురాలు కె.కల్యాణి ఆధ్వర్యంలో అధికారులకు సమాధానం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరగా.. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడడం విచారకరమన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు ఆర్‌.ప్రకాష్‌, ఎస్‌ చిట్టితల్లి, కె.జ్యోతి, వాణి, వై.లీలారత్నం, కె.పార్వతి, బి.సూర్యకుమారి, బి.మల్లీశ్వరి పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 11:52 PM

Advertising
Advertising