ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఇలాగైతే.. సాగునీరు కష్టమే

ABN, Publish Date - Mar 29 , 2024 | 12:05 AM

పలాస నియోజకవర్గంలో వంశధార కాలువ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఉన్నఫలంగా నీరు విడిచిపెడితే ఈ ప్రాంత శివారు భూములకు ఒక్క చుక్కకూడా నీరందని దుస్థితి నెలకొంది. 60టీ కాలువ ఈదురాపల్లి వద్ద మలుపులో షట్టర్లు విరిగిపోయాయి.

పూడుకుపోయిన వంశధార ప్రధాన కాలువ

- విరిగిన షట్టర్లు.. పేరుకుపోయిన చెత్త

- ఇదీ వంశధార కాలువ దుస్థితి

(పలాస)

పలాస నియోజకవర్గంలో వంశధార కాలువ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఉన్నఫలంగా నీరు విడిచిపెడితే ఈ ప్రాంత శివారు భూములకు ఒక్క చుక్కకూడా నీరందని దుస్థితి నెలకొంది. 60టీ కాలువ ఈదురాపల్లి వద్ద మలుపులో షట్టర్లు విరిగిపోయాయి. పిల్ల కాలువకు నీరు విడుదలయ్యే ప్రాంతంలో ఉన్న షట్టర్లు సైతం తుప్పుపట్టి ఊడిపోయాయి. పలాసలోని జగన్నాథసాగరం వద్ద కాలువ మొత్తం చెత్త, మురుగునీటితో పూడుకుపోయింది. నియోజకవర్గంలో వంశధార ప్రారంభమయ్యే టెక్కలిపట్నం వద్ద కూడా పరిస్థితి దారుణంగా ఉంది. నియోజకవర్గంలో మొత్తం 16 కిలోమీటర్లు పొడవునా పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో వంశధార కాలువ ద్వారా 5వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. గత 15 ఏళ్లుగా కాలువకు మరమ్మతులు చేపట్టలేదు. పూడికలు కూడా తొలగించకపోవడంతో కాలువ మొత్తం పాడైంది. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ వ్యర్థ నీరంతా జగన్నాథసాగరం వద్ద చేరి కాలువ అంతా కప్పబడింది. దీనికితోడు స్థానికులు శుభకార్యాల్లో మిగిలిన వ్యర్థాలను కూడా ఇందులోనే వేయడంతో జీవరాశులు సైతం నశించిపోతున్నాయి. ఆరేళ్లుగా నీరు విడుదల చేయలేకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే వచ్చిన నీరు నేరుగా వ్యర్థాలతో కలిసి కాలువల్లో కాకుండా పొలాల్లోకి చేరి పంటలు పాడయ్యేవని అభిప్రాయపడుతున్నారు. వంశధార ఆధారిత చెరువులు సైతం కలుషితమవుతున్నా అధికారులు మౌనం దాల్చుతున్నారని ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వంశధారకు మోక్షం కలుగుతుందని భావించామని.. కానీ, ప్రకటనలే తప్ప హామీలు అమలుకావడం లేదని వాపోతున్నారు. పలాసకు వంశధార నీరు ఏ విధంగా తీసుకురావాలి.., కాలువ ఆధునికీకరణ వంటి పనులపై అధికారపార్టీ నేతలు దృష్టి సారించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతిపైనే ఆధారపడి పంటలు పండించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:05 AM

Advertising
Advertising