ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాడాంలో భారీ బాణసంచా నిల్వలు స్వాధీనం

ABN, Publish Date - Oct 25 , 2024 | 11:11 PM

బాడాం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా సామాన్లను శుక్రవారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న మందుగుండు సామాన్లు

నరసన్నపేట, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): బాడాం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా సామాన్లను శుక్రవారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలో శివ్వాల సత్యనారాయణ ఇంట్లో బాణ సంచా సామగ్రి ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించా మన్నా రు. సత్యనారాయణ సుమారు రూ.2 లక్షల విలువ చేసే సామగ్రిని నిల్వ ఉంచి నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి కేసు నమోదుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడులలో రెవెన్యూ అధికారులు పద్మావతి, ప్రసాద్‌ పాల్గొన్నారు. బొరిగివలస గ్రామంలో కూడా ఒక షాపులో భారీగా నిల్వలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.

Updated Date - Oct 25 , 2024 | 11:11 PM