ఒకేచోటకు నాలుగు తరాలు
ABN, Publish Date - Jan 18 , 2024 | 12:19 AM
కనుగులవలస గ్రామంలో నాలుగు తరాలకు చెందిన సుమారు 200 మంది కుటుంబ సభ్యులు ఒక్కచోటకు చేరి సందడిగా గడిపారు.
రామజోగినాయుడి కుటుంబ సభ్యులు
ఆమదాలవలస: కనుగులవలస గ్రామంలో నాలుగు తరాలకు చెందిన సుమారు 200 మంది కుటుంబ సభ్యులు ఒక్కచోటకు చేరి సందడిగా గడిపారు. గ్రామంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్ బొడ్డేపల్లి రామజోగినాయుడు శతజయంతి వేడుకలు బుధవారం కుటుంబ సభ్యులు నడుమ నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు, డీసీసీబీ డైరెక్టర్ బొడ్డేపల్లి నారాయణరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాగా రామజోగి నాయుడికి ఐదుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఒక కుమారుడు మృతి చెందాడు.
Updated Date - Jan 18 , 2024 | 12:19 AM