ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మాజీ మంత్రి అప్పలరాజు హౌస్‌ అరెస్ట్‌

ABN, Publish Date - Oct 27 , 2024 | 11:44 PM

మాజీ మంత్రి, వైసీపీ నాయ కుడు డాక్టర్‌ సీదిరి అప్పలరాజును కాశీ బుగ్గ పోలీసులు ఆది వారం హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న మాజీ మంత్రి అప్పలరాజు

పలాస, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ నాయ కుడు డాక్టర్‌ సీదిరి అప్పలరాజును కాశీ బుగ్గ పోలీసులు ఆది వారం హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ- వైసీపీ నాయకుల పర స్పర దాడుల నేపథ్యంలో కాశీబుగ్గ పోలీస్‌ స్టేషన్‌ వద్ద భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. రెండు రోజుల కిందట ఓ బాలిక, ఆమె తల్లిపై టీడీపీ నాయకులు దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలు తెలుసుకునేం దుకు కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్నట్లు అప్పలరాజు ప్రకటించారు. ఇదిలా ఉండగా శనివారం రాత్రి ఇరు పార్టీల నేతల మధ్య స్టేషన్‌ ఆవరణలో ఘర్షణ జరిగినవ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఘర్షణలు జరగవచ్చనే ముందస్తు సమాచారంతో అప్పలరాజును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఉదయం 10 గంటల నుంచి మాజీ మంత్రి నివాసానికి వైసీపీ నాయకులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పలరాజు ఇంటి బయటకు రాగా ఎటువంటి అవాంఛనీయ ఘటన లు జరగకుండా ఉండేందుకు ముందస్తు హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నట్లు కాశీబుగ్గ సీఐ డి. మోహనరావు తెలిపారు. దీంతో అప్పలరాజు వారితో వాగ్వాదం చేశారు. వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి, పోలీసులకు, ఎమ్మెల్యే శిరీషకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయనను ఇంటిలోకి పంపడంతో వివాదం సద్దు మణిగింది. ఇదిలా ఉండగా నిందితులపై పోక్సో కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి అప్పలరాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు విలేకరులతో మాట్లాడుతూ.. స్టేషన్‌లోనే దాడులు చేసిన వారిపై హత్యాయత్నం కేసులు పెట్టాలని కోరారు.

Updated Date - Oct 27 , 2024 | 11:44 PM