ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోటి కాంతుల దీపోత్సవం

ABN, Publish Date - Nov 25 , 2024 | 11:42 PM

కార్తీక సోమవారం సంధ్య వేళ.. కోటి దీపకాంతులతో సిక్కోలు నగరం దేదీప్యమైంది. శ్రీకాకుళంలోని కత్తెరవీధి మైదానంలో (పీఎస్‌ఎన్‌ఎం స్కూల్‌ వెనుక) సోమవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు కోటి దీపోత ్సవం వైభవంగా నిర్వహించారు.

కోటి దీపోత్సవంలో పాల్గొన్న మహిళలు

శ్రీకాకుళం కల్చరల్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): కార్తీక సోమవారం సంధ్య వేళ.. కోటి దీపకాంతులతో సిక్కోలు నగరం దేదీప్యమైంది. శ్రీకాకుళంలోని కత్తెరవీధి మైదానంలో (పీఎస్‌ఎన్‌ఎం స్కూల్‌ వెనుక) సోమవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు కోటి దీపోత ్సవం వైభవంగా నిర్వహించారు. పుణ్యపువీధికి చెందిన శ్రీ సీతారామ సహిత ఆంజనేయస్వామి ఆలయ ధర్మకర్త, విశ్రాంత బ్యాంకు అధికారి ముక్కాల కొండబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది మహిళలు, భక్తులు పాల్గొని దీపాలు వెలిగించారు. ప్రధాన వేదిక వద్ద అరసవల్లికి చెందిన రుత్వికులు హరి సూర్య ప్రసాద్‌ శర్మ, ఒడిశా నుంచి వచ్చిన ఉమామహేశ్వర సిద్ధాంతి ప్రవచనాలు చేశారు. శాస్త్రోక్తంగా సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు 108మంది దంపతులచే 108 శివలింగాల వద్ద రుద్రాభిషేకాలు, దశవిధ హారతుల పూజలు నిర్వహించారు. కార్తీకమాసం విశిష్టత వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌ దంపతులతోపాటు దుప్పల వెంకటరావు, ముక్కాల కొండబాబు, రాళ్ళపాటి అరవింద, ఎం.నారాయణరావు, సుంకర కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 11:42 PM