పంట నమోదు.. ఈకేవైసీ తప్పనిసరి
ABN, Publish Date - Oct 05 , 2024 | 11:40 PM
పంట నమోదు.. ఈకే వైసీ తప్పనిసరిగా రై తులు చేయించుకోవా లని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పండ్కర్ సూ చించారు.
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పండ్కర్
ఆమదాలవలస: పంట నమోదు.. ఈకే వైసీ తప్పనిసరిగా రై తులు చేయించుకోవా లని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పండ్కర్ సూ చించారు. తోటాడ గ్రా మంలో ఖరీఫ్ వరికి ఈ-పంట నమోదులో భాగంగా నిర్దేశించిన సర్వే నెంబర్లలోని పం టలను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామ వ్యవసాయ సహాయకుల పనితీరు, రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న ఎరువులు, విత్తనాలు, ఇతర సేవలపై ఆరా తీశారు. ఈకేవైసీ నమోదులోని లోటుపాట్లు గురించి అడిగి తెలుసుకొని రైతులకు, వ్యవసాయాధికారులకు తగు సూచనలు, సలహాలు అందించారు. డ్రోన్ల సాయంతో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలిం చారు. వ్యవసాయశాఖ జిల్లా అధికారి కోరాడ త్రినాఽథస్వామి, అసిస్టెంట్ డైరెక్టర్ రజని, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మెట్ట మోహన్‌రావు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సుధీర్, పలువురు సర్వేయర్లు వీఆర్‌వోలు హాజరయ్యారు.
Updated Date - Oct 05 , 2024 | 11:40 PM