ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రెవెన్యూ సమస్యలకు చెక్‌

ABN, Publish Date - Dec 04 , 2024 | 12:22 AM

రెవెన్యూ సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో భారీగా భూ అవకతవకలు జరిగాయి. జగనన్న ఇళ్ల కాలనీలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున భూ దందా జరిగిందనే విమర్శలు ఉన్నాయి.

ఇచ్ఛాపురంలోని వార్డు సచివాలయం

- ఈ నెల 6 నుంచి గ్రామాల్లో సదస్సులు

- సన్నాహాలు చేస్తున్న అధికారులు

ఇచ్ఛాపురం, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో భారీగా భూ అవకతవకలు జరిగాయి. జగనన్న ఇళ్ల కాలనీలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున భూ దందా జరిగిందనే విమర్శలు ఉన్నాయి. దీనికితోడు 20 ఏళ్లు దాటిన డీ పట్టా భూములను అమ్ముకోవచ్చన్న జీవోతో వందలాది ఎకరాలు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం జూన్‌ నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు స్వీకరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 71,335 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 66 శాతం ఫిర్యాదులకు పరిష్కార మార్గం చూపించింది. అయితే రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి వినతులు స్వీకరించి, సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 6 నుంచి మూడు రోజులపాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.

గ్రామాల వారీగా సదస్సులు

జిల్లాలో 912 పంచాయతీలు, 835 సచివాలయాలు ఉన్నాయి. పంచాయతీల వారీగా గ్రామ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాలను సందర్శిస్తారు. భూ ఆక్రమణలు, 22ఏలో ఉన్న భూముల తారుమారు వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టిపెడతారు. వాటిని సరిచేసి బాధితులకు న్యాయం చేస్తారు. సదస్సులపై తొలుత రాజకీయ నేతలు, స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాల ప్రతినిధులతో కలెక్టర ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. సన్నాహాక సమావేశంలో ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యాన్ని తెలియజేస్తారు. గ్రామాల్లో ముఖ్య ప్రదేశాల్లో గ్రామసభలు నిర్వహిస్తారు. సదస్సుకు రెండు రోజుల ముందు గ్రామానికి సంబంధించి అడంగల్‌, పహాణి, ప్రభుత్వ భూ రిజిస్టర్‌ కాపీలు ముద్రించి వీఆర్వో ప్రదర్శిస్తారు. స్వీకరించిన అర్జీలకు రశీదులు, తక్షణం తీసుకున్న చర్యలకు సంబంధించి నివేదిక అందించాల్సి ఉంటుంది. జిల్లాకు ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని పర్యవేక్షణాధికారిగా ప్రభుత్వం నియమించనుంది.

అన్ని శాఖలతో బృందం

వాస్తవానికి ఆగస్టులోనే గ్రామ రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. కానీ అప్పట్లో ఉద్యోగుల బదిలీలు, రెవెన్యూ సిబ్బంది స్థానచలనం కారణంగా వాయిదా వేసింది. తాజాగా నిర్వహించనున్న సదస్సులకు సంబంధించి బృందంలో తహసీల్దారు, ఆర్‌ఐ, సంబంధిత గ్రామాల వీఆర్వో, మండల సర్వేయర్‌, దేవదాయ శాఖ అధికారి, అవసరమైన చోట వక్ఫ్‌బోర్డు అధికారి, రిజిస్ర్టేషన్‌, అటవీ భూములకు సంబంధించి అధికారి ఉంటారు. ఆయా గ్రామాల్లో రీసర్వే పూర్తయితే నూతనంగా తయారుచేసిన ఆర్వోఆర్‌ను చదివి అభ్యంతరాలు స్వీకరిస్తారు. పార్టీ లోగోలు, రంగులతో కూడిన బీహెచ్‌పీలను తిరిగి సేకరిస్తారు. మళ్లీ తాజాగా రైతులకు అందిస్తారు. కలెక్టర్‌, జేసీ సైతం సదస్సుల్లో పాల్గొంటారు. ఆర్డీవోలు విధిగా ప్రతి మండలంలో రెండు గ్రామాలను సందర్శిస్తారు. సదస్సుల్లో వచ్చిన వినతులను అక్కడికక్కడే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. కొన్ని తక్షణమే పరిష్కరిస్తారు. మిగిలినవి ఉన్నతాధికారులకు చేరవేస్తారు. సదస్సులు పూర్తయిన 45 రోజుల్లో సమస్యకు తప్పకుండా పరిష్కార మార్గం చూపించడమే ఈ సదస్సుల ముఖ్య ఉద్దేశ్యమని రెవెన్యూ అధికారులు తెలిపారు.

Updated Date - Dec 04 , 2024 | 12:22 AM