ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గ్రామాల్లో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ

ABN, Publish Date - Jan 28 , 2024 | 12:12 AM

బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాలు గ్రామాల్లో పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు కొన సాగుతున్నాయి. శనివారం ఇంటింటికీ వెళ్లి వైసీపీ వైఫల్యాలను, టీడీపీ మేనిఫెస్టోను నేతలు, కార్యకర్తలు వివరించారు. అలాగే ‘పల్లె పల్లెకు టీడీపీ’ నిర్వహించారు. కార్యక్రమాల్లో టీడీపీ-జనసేన క్యాడర్‌ పాల్గొన్నారు.

టెక్కలి: బన్నువాడలో ‘భవిష్యత్‌ గ్యారెంటీ’ నిర్వహిస్తున్న నాయకులు

బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాలు గ్రామాల్లో పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు కొన సాగుతున్నాయి. శనివారం ఇంటింటికీ వెళ్లి వైసీపీ వైఫల్యాలను, టీడీపీ మేనిఫెస్టోను నేతలు, కార్యకర్తలు వివరించారు. అలాగే ‘పల్లె పల్లెకు టీడీపీ’ నిర్వహించారు. కార్యక్రమాల్లో టీడీపీ-జనసేన క్యాడర్‌ పాల్గొన్నారు.

సైనికుల్లా పనిచేయండి

మెళియాపుట్టి: టీడీపీ, జనసేన కార్యకర్తలు ఎన్నికలు ముగిసే వరకు సైనికుల్లా పనిచేసి టీడీపీ-జనసేన కూటమి విజయానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి అన్నారు. శని వారం చాపర, సుందరాడ, పెద్దపద్మాపురం, సిరియాఖండి గ్రామాల్లో ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం గత ఎన్ని కల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్లీ ఓట్లు అడిగేందుకు వస్తోం దన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అడ్డుతోవలో గెలుపొందేలా చూస్తోం దని, వీటిని అడ్డుకోవాలని కోరారు. అనంతరం గ్రామాల్లో బాబూ ష్యూరి టీ భవిష్యత్‌కు గ్యారెంటీ నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు వసంత్‌, పరమేష్‌రెడ్డి, శ్రీఽధర్‌, జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ-జనసేన కూటమిదే అధికారం

టెక్కలి: రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ- జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని టీడీపీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరి అన్నారు. శనివారం బన్నువాడ, మోదుగు వలస గ్రామా ల్లో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరిచిందన్నారు. గ్యాస్‌, పెట్రోల్‌, ఫలితంగా మధ్యతరగతి కుటుంబాలపై కూడా భారం పడిందన్నారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ వైఫల్యాలను, టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు బసవల అప్పలస్వామి, హనుమంతు రామకృష్ణ, ఇప్పిలి జగదీశ్వరరావు, దల్లి ప్రసాద్‌రెడ్డి, ప్రీతీష్‌ చంద్ర, వట్టికూళ్ల రామకృష్ణ, సనపల మురళి, వట్టికూళ్ల తిరుమలరావు, వట్టికూళ్ల ఢిల్లీ తదితరులు పాల్గొన్నారు.

పాతపట్నంలో...

పాతపట్నం: పాతపట్నంలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెం టీ కార్యక్రమాన్ని శనివారం టీడీపీ పట్టణ అధ్యక్షుడు సైలాడ సతీష్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ వైఫీల్యాలను, టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీ ఆధ్వర్యంలోనే రాష్ట్రాభివృద్ధి

జలుమూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వంలోనే మరలా అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ అన్నారు. బద్రి ఎస్సీ వీధిలో శనివారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ వైఫల్యాలను వివరించారు. టీడీపీ అధికారంలోకి రాగానే అమలు చేయనున్న పథకాలపై ప్రజలకు అవగాహన కలిగించారు. కార్యక్రమంలో నాయకులు బలగ రవి, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

కలిసికట్టుగా టీడీపీ విజయానికి కృషి

పలాసరూరల్‌: రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని టీడీపీ నాయకులు అన్నారు. గురుదాసుపురం, బ్రాహ్మణతర్లా, బొడ్డపాడు, లక్ష్మీపురం పంచాయతీల్లో శనివారం పల్లె పల్లెకు టీడీపీ, బాబూ ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాలు నిర్వహించారు. ఇతర పార్టీల నుంచి అసంతృప్తి నాయకులు టీడీపీలో చేరుతామంటే వారిని కలుపుకొని వెళ్లాలని, బూత్‌ల నుంచి అధిక శాతం ఓట్లు పడేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నేతలు పీరికట్ల విఠల్‌ రావు, కుత్తుమ లక్ష్మణరావు, కిక్కర ఢిల్లీరావు, దువ్వాడ సంతోష్‌ కుమార్‌, యాదగిరి పాల్గొన్నారు.

టీడీపీతోనే భవిష్యత్‌

కంచిలి: టీడీపీతోనే రాష్ట్రభవిష్యత్‌ సాధ్యమని ఆ పార్టీ నాయ కులు అన్నారు. శనివారం కొల్లూరు పంచాయతీ కొల్లూరు గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి పార్టీ మినీ మేనిఫెస్టోపై వివరించి, కర పత్రాలు పంపిణీ చేశారు. పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 12:12 AM

Advertising
Advertising