ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ హయాంలో బీసీలపై దాడులు

ABN, Publish Date - Jan 18 , 2024 | 11:44 PM

వైసీపీహయాంలో బీసీలపై దాడులు జరగడంపై టీడీపీనాయకులు ధ్వజమెత్తారు. గురువారం పాతపట్నం, నరసన్నపేటలో జయహో బీసీ కార్యక్రమం, సారవకోట మండలం చీడిపూడిలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు.

నరసన్నపేట: మాట్లాడుతున్న బగ్గు రమణమూర్తి :

వైసీపీహయాంలో బీసీలపై దాడులు జరగడంపై టీడీపీనాయకులు ధ్వజమెత్తారు. గురువారం పాతపట్నం, నరసన్నపేటలో జయహో బీసీ కార్యక్రమం, సారవకోట మండలం చీడిపూడిలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు.

టీడీపీతో ప్రగతి సాధ్యం

నరసన్నపేట: బీసీ ప్రగతి టీడీపీతోనే సాధ్యమని నరసన్నపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బగ్గు రమణమూర్తి తెలిపారు. నరసన్నపే టలోని ఆదివారంపేటలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివంగత ఎన్టీఆర్‌ స్ఫూర్తితో సైకో, దుష్ట పాల నను గద్దెదించాలన్నారు.బాబుగ్యారెంటీ -భవిష్యత్తుకు ష్యూరిటీ కార్యక్ర మం గ్రామాల్లో వేగవంతం చేయాలన్నారు. ఈనెల 28న టెక్కలిలో నారా చంద్రబాబునాయుడు బహిరంగ సభకు ప్రతి గ్రామం నుంచి వందలాది మంది టీడీపీ సానుభూతిపరులను తరలించాలన్నారు. రా.. తెలుగుదేశం పిలుస్తోంది కదిలిరా ..కార్యక్రమంతో వైసీపీ నాయకులు గుండెల్లో రైలు పరుగులు పెట్టించాలన్నారు.కార్యక్రమంలో టీడీపీ బీసీవిభాగ రాష్ట్ర నాయ కులు ధర్మాన తేజేశ్వరరావు, శిమ్మ చంద్రశేఖర్‌, వెలమల రాజేంద్రనా యుడు, కత్తిరివెంకట రమణ, ఎం.వెంకటప్పలనాయుడు, గొండు రామన్న, జల్లు చంద్రమౌళి, గొద్దు చిట్టిబాబు, బెవర రాము, కింజరాపు రామారావు, పూతి రమణ, బైరి భాస్కరరావు, గొండు స్వామిబాబు పాల్గొన్నారు.

బీసీలకు రక్షణ చట్టం

పాతపట్నం: వైసీపీ పాలనలో బీసీలకు నిరాదరణే మిగిలిందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కలమట వెంకటరమ ణమూర్తి తెలిపారు. పాతపట్నంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వ హించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ కక్షపూరిత రాజకీయాలతో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. పార్టీ అధికారంలో కొచ్చిన వెంటనే బీసీలకు రక్షణచట్టం అమలులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. పార్టీ రాష్ట్రకార్యదర్శి కలమట సాగర్‌ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి ఎల్‌ఎల్‌నాయుడు, సీమరామ కృష్ణ, పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, కొత్తూరు ,ఎల్‌ఎన్‌పేట మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అరాచక పాలనకు అంతం పలకాలి

జలుమూరు (సారవకోట): రాష్ట్రంలో అరాచక పాలనకు అంతం పలకాలని టీడీపీ మండలాధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ తెలిపారు. సారవకోట మండలంలోని చీడిపూడిలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం రావణకాష్టంగా మారిందన్నారు. పథకాల పేరుతో వైసీపీనాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనార్దనరావు, కింజరాపు రామారావు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 11:44 PM

Advertising
Advertising