ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చంద్రబాబు నిర్ణయం తర్వాతే..

ABN, Publish Date - Apr 03 , 2024 | 11:50 PM

టీడీపీ అధినేత చంద్ర బాబు నిర్ణయం తర్వాతే తమ నిర్ణ యం తెలియజేస్తా మని మాజీ మంత్రి గుండ అప్పలసూర్య నారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తెలిపారు.

అరసవల్లి: టీడీపీ అధినేత చంద్ర బాబు నిర్ణయం తర్వాతే తమ నిర్ణ యం తెలియజేస్తా మని మాజీ మంత్రి గుండ అప్పలసూర్య నారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తెలిపారు. బుధవారం అరసవల్లిలోని తమ స్వగృహంలో వారు విలేకరులతో మాట్లాడారు. మూడు విడతల్లో ప్రకటించిన టికెట్ల జాబితాలో తమ పేరు లేకపోవడంతో ఎంతో ఎంతో ఆవేదనకు, ఆశ్చర్యానికి గురయ్యామన్నారు. అనంతర పరిణామాలతో పార్టీ అధినేత మమ్మల్ని పిలిపించి మాట్లాడారని, ఇక్కడి పరిస్థితిని వారికి వివరించామ న్నారు. నాలుగు రోజుల్లో తన నిర్ణయాన్ని తెలియజేస్తామని చెప్పారని, అంతవరకు వేచి చూస్తామని గుండ దంపతులు స్పష్టం చేశారు. పార్టీలో గ్రూపులు కట్టడం అనేది కేన్సర్‌ వ్యాధిలాంటిదని, గత రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురిం చిందన్నారు. తమను ఆదరించి, వెన్నంటి నడుస్తున్న అభిమానులు, కార్యకర్తలకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Apr 03 , 2024 | 11:50 PM

Advertising
Advertising