డీలర్లకు నష్టం లేకుండా చర్య తీసుకోవాలి
ABN, Publish Date - Sep 21 , 2024 | 11:51 PM
రేషన్ డీలర్లకు నష్టం లేకుండా, కార్డుదారులకు ఇబ్బంది కలగకుండా, రూరల్ ఏరియాలో 600 కార్డులు, అర్బన్ ఏరియాలో 800 కార్డులకు తక్కువ లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సంఘ జిల్లా యూనియన్ నాయకులు కోరారు.
కలెక్టరేట్: రేషన్ డీలర్లకు నష్టం లేకుండా, కార్డుదారులకు ఇబ్బంది కలగకుండా, రూరల్ ఏరియాలో 600 కార్డులు, అర్బన్ ఏరియాలో 800 కార్డులకు తక్కువ లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సంఘ జిల్లా యూనియన్ నాయకులు కోరారు. కనీస వేతనం రూరల్ ఏరియాలో రూ.18,500, పట్టణ ప్రాంతాల్లో రూ.24,500లు ఆదా యం వచ్చేలా ఏర్పాటుచేయాలని తెలిపారు.ఈ మేరకు శనివారం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌కు ఆయన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్డులు విభజించే ముందు అధికారులు యూనియన్‌ని సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డీలర్ల యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎ.రామారావు, ఎన్.రవికుమార్, పి.కోటేశ్వరరావు, కె.చిట్టియ్య, కె.నాగరాజు, పి.రాజు పాల్గొన్నారు.
Updated Date - Sep 21 , 2024 | 11:51 PM