ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘దేవర’ పోస్టర్లపై ‘సేవ్‌ వైజాగ్‌ స్టీల్‌’

ABN, Publish Date - Sep 27 , 2024 | 03:41 AM

విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం కార్మికులు 1300 రోజులుగా చేస్తున్న దీక్షకు జూనియర్‌ ఎన్‌టీఆర్‌ మద్దతు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ జనజాగరణ సమితి ప్రతినిధులు గురువారం విశాఖ నగరంలో ‘దేవర’ సినిమా పోస్టర్లపై ‘సేవ్‌ వైజాగ్‌ స్టీల్‌’

విశాఖపట్నం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం కార్మికులు 1300 రోజులుగా చేస్తున్న దీక్షకు జూనియర్‌ ఎన్‌టీఆర్‌ మద్దతు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ జనజాగరణ సమితి ప్రతినిధులు గురువారం విశాఖ నగరంలో ‘దేవర’ సినిమా పోస్టర్లపై ‘సేవ్‌ వైజాగ్‌ స్టీల్‌’ అని రాసి ఉన్న కరపత్రాలు అంటించారు. కోట్లాది మంది అభిమానులు ఉన్న ఎన్‌టీఆర్‌ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలిస్తే ప్రభుత్వాల్లో తప్పకుండా చలనం వస్తుందని ఈ సందర్భంగా జన జాగరణ సమితి కన్వీనర్‌ వాసు అభిప్రాయపడ్డారు. విశాఖలో శ్రీరామా టాకీస్‌ వద్ద స్లోగన్లు అతికించిన తరువాత ఆయన మాట్లాడుతూ ఎన్‌టీఆర్‌ అభిమాన సంఘాలు కూడా విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు.

Updated Date - Sep 27 , 2024 | 03:42 AM