ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

న్యాయాధికారుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లు!

ABN, Publish Date - Nov 16 , 2024 | 04:34 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు సవరణ బిల్లులను శుక్రవారం శాసనసభ ఆమోదించింది.

అమరావతి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు సవరణ బిల్లులను శుక్రవారం శాసనసభ ఆమోదించింది. న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు-2024ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ సభలో ప్రవేశపెట్టారు. సభ్యులు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ఈ బిల్లు సభ ఆమోదం పొందినట్లు స్పీకరు ప్రకటించారు. ఇంధన శాఖ మంత్రి గొట్టపాటి రవికుమార్‌ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ డ్యూటీ (రెండో సవరణ) బిల్లు కూడా సభ ఆమోదం పొందింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ద్రవ్య వినిమయ తాత్కాలిక బడ్జెట్‌-2 బిల్లును శాసనసభ ఆమోదించింది. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై చర్చ లేకుండా శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

Updated Date - Nov 16 , 2024 | 04:34 AM