ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రముఖ మృదంగ విద్వాంసుడు కమలాకరరావు కన్నుమూత

ABN, Publish Date - Nov 12 , 2024 | 03:57 AM

ప్రఖ్యాత మృదంగ విద్వాంసుడు వరదరావు కమలాకరరావు (88) కన్నుమూశారు.

రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత మృదంగ విద్వాంసుడు వరదరావు కమలాకరరావు (88) కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో సోమవారం తుది శ్వాసవిడిచారు. స్వాతం త్య్ర సమర యోధులు, వారి కుటుంబాలకు నిత్యాన్నదానం సాగించిన జి.వరదారావు, నేత్రావతి దంపతులకు 1936లో కమలాకరరావు జన్మించారు. చిన్న వయసు నుంచే మృదంగం పట్ల ఎనలేని మక్కువ కనబరిచేవారు. మృదంగాన్ని నేర్చుకుని అనతికాలంలోనే దేశవ్యాప్తంగా పేరుగాంచారు. పాల్గాట్‌ మణి అయ్యర్‌ వద్ద గురుకులవాసం చేశారు. కళాశాల విద్యార్థిగా ఉండగానే అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చేతుల మీదుగా ప్రెసిడెంట్‌ మెడల్‌ను అందుకున్నారు. ద్వారం వెంకటస్వామి వంటి గొప్ప వయోలిన్‌ విద్వాంసులు మొదలుకొని జీఎన్‌ బాలసుబ్రహ్మణ్యం, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌, చెంబై వైద్యనాథ్‌ భాగవతార్‌, టీకే రంగాచారి, శ్రీపాద పినాకపాణి, ఈమని శంకరశాస్త్రి వంటి ప్రముఖుల మెప్పుపొందారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌ సహా అనేక దేశాల్లో శాస్త్రీయ సంగీత సభల్లో శ్రోతలను మైమరిపించారు. గణపతి సచ్చిదానందస్వామి, పాల్గాట్‌ మణి అయ్యర్‌ మెమోరియల్‌, కంచికామకోటి పీఠం అవార్డులను అందుకున్నారు. ఆయన ముగ్గురు కుమారులు యోగీష్‌, జగదీష్‌, హరీష్‌ మృదంగం విద్వాంసులుగా రాణిస్తున్నారు. కుమార్తెలు నిర్మల, షీలా ఉన్నారు. కమలాకరరావు భార్య గతంలోనే మరణించారు.

Updated Date - Nov 12 , 2024 | 03:57 AM