ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొనసాగిన ఆక్రమణల తొలగింపు

ABN, Publish Date - Nov 25 , 2024 | 01:10 AM

పట్టణం లో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఆదివారం కొన సాగింది. ప్రధానంగా రాజాజీవీధి, రథంబజర్‌, తూర్పు వీధి ప్రాంతాల్లో మురుగు కాలువలపై ఆక్రమణలను మున్సిపల్‌ సిబ్బంది తొలగించారు.

మార్కాపురం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పట్టణం లో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఆదివారం కొన సాగింది. ప్రధానంగా రాజాజీవీధి, రథంబజర్‌, తూర్పు వీధి ప్రాంతాల్లో మురుగు కాలువలపై ఆక్రమణలను మున్సిపల్‌ సిబ్బంది తొలగించారు. కొన్నిచోట్ల భవనాల యజమానులే స్వచ్ఛందంగా తొలగించుకున్నారు. స్థానిక అయ్యప్పస్వామి దేవస్థానం వెనుకవైపు ఇప్పటికే ఉన్న ఆక్రమణలు తొలగించగా శనివారం రాత్రి ఎవరికీ తెలియకుండా ఓ మహిళ షెడ్‌ నిర్మించింది. విషయం తెలుసుకున్న మున్సిపల్‌, పోలీసులు అఽధికారులు పరిశీ లించి తాత్కాలిక నిర్మాణాన్ని వెంటనే తొలగించారు. అదేవిధంగా అయ్యప్పస్వామి గుడి నుంచి చెన్నకేశవ స్వామి దేవస్థానానికి వెళ్లే బజార్‌లో కూడా యజ మానులు త్వరితగతిన ఆక్రమణలు తొలగించుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ నారాయణరావు, సీఐ సుబ్బారావు లు సూచించారు.

గాంధీపార్కు వద్ద ఉద్రిక్తత

స్థానిక గడియార స్తంభం వద్ద గాంధీ పార్కులోని తూర్పువైపు గోడపై వున్న ఇనుప గ్రిల్స్‌ తొలగించారు. దీంతో పార్కును నిర్వహిస్తున్న మైస్‌ సంస్థ ప్రతినిధులతో కలిసి 4వ వార్డు కౌన్సిలర్‌ చెప్పల్లి కనకదుర్గ అక్కడకు చేరుకున్నారు. తాము కొన్ని దశాబ్ధాలుగా పార్కును నిర్వహిస్తున్నందున అందులోకి తోపుడుబండ్ల వారిని రానివ్వమని పనులు నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న కమిషనర్‌ నారాయణరావు, సీఐ సుబ్బారావులు సిబ్బందితో కలిసి అక్కడకు వెళ్లారు. కొద్దిసేపు అధికారులు, కౌన్సిలర్‌ కనకదుర్గకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న మున్సిపల్‌ ఛైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ ఇరువురితో మాట్లాడారు. పార్కు ప్రాధాన్యతను వివరించి కొన్ని నాలుగు అడుగుల మేర మాత్రమే లోపలికి అనుమతించేందుకు ఒప్పందం చేశారు. తొలుత కౌన్సిలర్‌ కనకదుర్గ ససేమిరా అన్నా అందరూ సర్థిచెప్పడంతో ఒప్పందానికి అంగీకరించారు.

వన్‌వేలో ఆటంకాలు లేకుండా చూడాలి: డీఎస్పీ

మార్కాపురం పట్టణం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న వన్‌వేలో వాహనా లు తిరిగేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని మున్సిపల్‌ అధికారులకు డీఎస్పీ డాక్టర్‌ యు.నాగరాజు తెలిపారు. వన్‌వే ప్రాంతాన్ని సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడే ఉన్న కమిషనర్‌ నారాయణరావు, ఈవో శ్రీనివాసరెడ్డి, ఆర్‌టీసీ డీఎం నరసింహులుతో మాట్లాడారు. ప్రధానం గా ట్రాపిక్‌ నియంత్రణ కోసం చేస్తున్న ఈ ప్రయత్నం లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే విజయ వంతం అవుతుందని అన్నారు. ముఖ్యంగా తూర్పువీధి జువ్విచెట్టు నుంచి విఘ్నేశ్వరస్వామి ఆలయం వద్దకు వాహనాలు తిరిగేందుకు ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఆక్రమణలను త్వరితగతిన తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట సీఐ సుబ్బారావు, టూ టౌన్‌ ఎస్సై రాజమోహనరావు, రూరల్‌ ఎస్సై అంకమ్మరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 01:11 AM