ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రేషన్‌ డీలర్లు డీలా..!

ABN, Publish Date - Oct 11 , 2024 | 12:16 AM

గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో పౌర సరఫరాల సంస్థ నిర్వీర్యమై ఆదాయాలు పడిపోయి, అగచాట్లు పాలైన రేషన్‌ డీలర్లు ఇప్పుడు మరింత డీలా పడిపోయారు.

షాపుల రేషనలైజేషన్‌ ప్రక్రియతో చిక్కులు

వైసీపీ పాలనలో పౌర సరఫరాల వ్యవస్థ నిర్వీర్యం

సరఫరా లేక, కమీషన్లు రాక డీలర్ల అగచాట్లు

ప్రస్తుతం కార్డుల సంఖ్య తగ్గిస్తే కష్టమంటూ ఆవేదన

ఏలూరు రూరల్‌, అక్టోబరు 10 : గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో పౌర సరఫరాల సంస్థ నిర్వీర్యమై ఆదాయాలు పడిపోయి, అగచాట్లు పాలైన రేషన్‌ డీలర్లు ఇప్పుడు మరింత డీలా పడిపోయారు. ప్రభుత్వం రేషన్‌ షాపులకు రేషన్‌ కార్డులను కుదిస్తూ చేపట్టిన రేషనలైజేషన్‌ ప్రక్రియ వారికి శరాఘాతంగా మారింది. గత ప్రభుత్వ నిర్వాకంతో నామమాత్రంగా మారిన రేషన్‌ సరఫరా వ్యవస్థ ప్రభుత్వ నిర్ణయంతో మనుగడ కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. గత ఐదేళ్లల్లో బియ్యం తప్ప మరే ఇతర సరుకులు సరఫరా చేసేందుకు అవకాశం తగ్గి కమీషన్లు తగ్గిపోయి అల్లాడుతున్న డీలర్లకు ఇప్పుడు రేషన్‌ కార్డులు తగ్గితే మరింత ఆదాయం పడిపోతుందని ఆవేదన చెందుతున్నారు.

రేషనలైజేషన్‌ చిచ్చు

జిల్లాలో సుమారు 6,78,511 మంది కార్డుదారులకు రేషన్‌ సర ఫరా చేసేందుకు సుమారు 1600 షాపులు ఉన్నాయి. వీటిని కూటమి ప్రభుత్వం రేషన లైజేషన్‌ చేయాలని నిర్ణయిం చింది. ఒక్కో రేషన్‌ షాపునకు గ్రామాల్లో 400 నుంచి 450 కార్డు లు, పట్టణాల్లో 500 నుంచి 550, నగరా ల్లో 600 నుంచి 650 షాపులు ఉండేలాగా ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. పెరిగిన జనాభాకు అను గుణంగా రేషన్‌ షాపును ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే తాత్కాలికంగా రేషనలైజేషన్‌ నిలుపుదల చేసినా ప్రభుత్వ తాజా నిర్ణయం కారణంగా తమ ఆదాయాలు పడిపోతా యని డీలర్లు ఆవేదన చెందుతున్నారు.

పడిపోయిన ఆదాయం

రేషన్‌ సరుకులు ప్రతినెల సరఫరా చేసేందుకు డీలర్లకు ఒక కిలోకు రూపాయి కమీషన్‌ ఇస్తున్నారు. ఒక్కో రేషన్‌ షాపులో సగటున 6 నుండి 10 టన్నుల బియ్యం సరఫరా అవుతుంది. 400 కార్డులు ఉండే షాపులో 7 టన్నుల రేషన్‌ బియ్యం సరఫరా అవుతుండగా, 600 కార్డులకు 10 టన్నులు సరఫరా అవుతోంది. కాగా డీలర్లకు 6 టన్నులు అయితే రూ.6వేలు, 10 టన్నులు అయితే రూ.10 వేలు ఆదాయం వస్తుంది. అరకిలో పంచదారకు 400 కార్డులకు రెండు క్వింటాళ్లు సరఫరా చేస్తారు. వీటికి రూ.300 కమీషన్‌ వస్తుంది. ఒక్కో షాపునకు రూ.6,200 నుంచి రూ.10 వేలకు మించి ఆదాయం రావడం లేదు. తమకు వచ్చే కమీషన్‌ అద్దెలు, నిర్వహణకే పోతుందని డీలర్లు వాపోతున్నారు.

Updated Date - Oct 11 , 2024 | 12:16 AM