ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అందని నీరు.. సాగని రబీ

ABN, Publish Date - Jan 29 , 2024 | 02:25 AM

రాష్ట్రంలో గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా రబీ సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. సీజన్‌ ముగింపు దశకు వచ్చినా.. సాగు విస్తీర్ణం 57ు కూడా దాటలేదు. 57.50లక్షల ఎకరాల సాగు లక్ష్యంలో 31.93 లక్షల ఎకరాల్లోనే విత్తనం

ప్రాజెక్టుల్లో అడుగంటిన నీరు.. ఖరీఫ్‌లో తీవ్రంగా నష్టపోయిన రైతులు

రబీ సాగుకు అందని పెట్టుబడులు

ఫలితంగా భారీగా తగ్గిన సాగు

57% దాటని సాగు విస్తీర్ణం

25.57లక్షల ఎకరాలు బీడు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా రబీ సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. సీజన్‌ ముగింపు దశకు వచ్చినా.. సాగు విస్తీర్ణం 57ు కూడా దాటలేదు. 57.50లక్షల ఎకరాల సాగు లక్ష్యంలో 31.93 లక్షల ఎకరాల్లోనే విత్తనం పడింది. దీంతో 25.57లక్షల ఎకరాలు ఖాళీగానే ఉన్నాయి. దాదాపు 40ు సాగు తగ్గడంతో పంట ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. గతేడాది జనవరి 25నాటి సాగు విస్తీర్ణంతో పోల్చితే.. ఈ ఏడాది 6.69 లక్షల ఎకరాల్లో సాగు తగ్గుదల కనిపిస్తోంది. సీజన్‌ సాధారణ సాగు అంచనా ప్రకారం ప్రధాన ఆహార పంటలైన వరి 50ు, చిరుధాన్యాలు 58ు, అపరాలు 60ు, నూనెగింజల పంటలు 51ు మాత్రమే సాగులో ఉన్నాయి. గత ఖరీఫ్‌ సీజన్‌లో సాగునీరు అందక వరి నాట్లు ఆలస్యం కాగా, పంటల కోత సమయంలో మిచౌంగ్‌ తుఫాను రావడంతో ధాన్యం నూర్పిళ్లు ఆలస్యమయ్యాయి. దీంతో రబీ (దాళ్వా) వరి నాట్లు కూడా ఆలస్యంగా మొదలయ్యాయి. ప్రస్తుతం జలాశయాల్లో నీటి మట్టాలు గణనీయంగా పడిపోగా, వేసవి నీటి అవసరాల పేరుతో దాళ్వా వరి సాగుకు ప్రభుత్వం నీటి విడుదల తగ్గించింది. ప్రస్తుతం ఈశాన్య రుతు పవనాల ప్రభావం ఏమీ కనిపించకపోవడంతో వరా ్షలు కురిసే పరిస్థితులు లేవు. మరోవైపు బోర్ల కింద వరి సాగుకు విద్యుత్‌ సరఫరా కూడా అంతంత మా త్రంగానే ఉంటోంది. దీంతో సాగునీటికి ఇబ్బందులు పడలేక చాలామంది రైతులు రెండో పంటగా వరి సాగును తగ్గించారు. కృష్ణా, గోదావరి డెల్టా కాలువల్లో నీరుపారుతున్న ప్రాంతాల రైతులు మాత్రం వరి నాట్లు వేస్తున్నారు. మెట్ట ప్రాంతాల రైతులు స్వల్పకాలిక పంటలైన అపరాలు, చిరుధాన్యాలు వేస్తున్నారు. మరికొద్ది రోజులు ఆగితే విత్తనం వేసినా.. గింజ మొలకెత్తి, కాపు కాసి, పంట కోతకొచ్చే సరికి మండువేసవి వచ్చేస్తుంది. అకాల వర్షాలు తప్ప, రుతుపవన వర్షాలు కురిసే అవకాశమే లేదని వాతావరణ విభాగం పేర్కొంటోంది. అందువల్ల నీటి వనరులు అందుబాటులో లేని రైతులంతా రబీ సాగుకు స్వస్తి చెప్పేశారు. గత ఐదేళ్లలో రబీ సీజన్‌లో ఇంతగా సాగు తగ్గిన దాఖలా లేదు.

సాయం చేయని సర్కార్‌

2023-24 రైతుకు ఏ మాత్రం కలిసి రాలేదు. ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావం, రబీ సాగు పుంజుకునే సమయంలో తుఫాను కారణంగా రైతులు పంట ఉత్పత్తులను కోల్పోయారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో నైరుతీ రుతుపవనాలు బలహీనమై, తొలకరిలో సరైన వర్షాలు కురవలేదు. దీంతో ఖరీఫ్‌ సాగు 73శాతానికే పరిమితం కాగా, సీజన్‌ ముగిసే సరికి 30ుపైగా వానలోటుతో పంట దిగుబడులు తగ్గాయి. పంట కోతకొచ్చే తరుణంలో తుఫాను ప్రభావంతో పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట అమ్మినా.. అప్పులు తీర్చడానికీ చాలాక.. ఎక్కువ మంది రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. గత ఖరీ్‌ఫలో కరువు, తుఫానుతో ఏర్పడిన నష్టాలను కేంద్ర బృం దాలు పరిశీలించినా.. రైతులకు నయా పైసా పరిహారం అందలేదు. మొక్కుబడిగా రాయితీ విత్తనాలిచ్చినా.. పంటల సాగుకు పెట్టుబడులు లేక చాలామంది రైతులు సాగుకు దూరమయ్యారు. ముఖ్యంగా కౌలు రైతులు కరువు, తుఫానుకు బాగా నష్టపోయి, ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డారు. గత రెండు సీజన్లకు సంబంధించి రూ.లక్షలోపు పంట రుణాలపై వడ్డీ రాయితీ, పంటల బీమా పరిహారం ఇంతవరకు జగన్‌ సర్కార్‌ విడుదల చేయలేదు. కరువు, తుఫానుకు పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ సొమ్ము ఇవ్వలేదు. ఏటా జనవరిలోనే ఇస్తామన్న రైతుభరోసా-పీఎం కిసాన్‌ సొమ్ము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాది ఇంతవరకు విడుదల చేయలేదు. దీంతో విత్తనం నాటాలన్నా, కూలి ఖర్చులకు విత్తం లేక రబీ సాగుకు రైతులు విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో 8 లక్షల మందికిపైగా కౌలు రైతులకు సాగుదారు హక్కు పత్రాలు ఇచ్చినా.. రబీ పంట రుణాలు లక్ష మందికి అందలేదు.

Updated Date - Jan 29 , 2024 | 02:25 AM

Advertising
Advertising