బాలికల వివరాలను పకడ్బందీగా సేకరించాలి
ABN, Publish Date - Oct 27 , 2024 | 01:32 AM
జిల్లాలో 12నుంచి 18 ఏళ్ళలో పు బాలికల వివరాలను పకడ్బందీగా సేకరించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. బాల్య వివాహాల నివారణ కోసం జిల్లా యంత్రాంగం బంగారు బాల్యం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, అక్టోబరు26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 12నుంచి 18 ఏళ్ళలో పు బాలికల వివరాలను పకడ్బందీగా సేకరించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. బాల్య వివాహాల నివారణ కోసం జిల్లా యంత్రాంగం బంగారు బాల్యం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. శనివారం సాయం త్రం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చి న్నారులు ఎంత మంది ఉన్నారు.. వారిలో ఎంతమంది అంగన్‌వాడీల్లోను, అలాగే పాఠశాల వయస్సు పిల్లలు ఎంత మంది ఉన్నారో గుర్తించాలని చెప్పారు. వారికి వ్యాక్సిన్స్ వేస్తున్న తీరు, రక్తహీనత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించా లన్నారు. బాల కార్మికులుగా పనిచేసి విముక్తి పొందిన పిల్లల ప్రస్తుత స్థితిగతు లపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బాల్యం ప్రతి చిన్నారికి సంతోషమ యంగా ఉండేలా జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టినందున పాఠశాలల నుంచి డ్రాపౌట్స్ లేకుండా, పోషకాహార లోపం లేకుండా, బాల్య వివాహాలు జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అందుకు సంబంధించిన డేటా ను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు సమావేశంలో అధికారులు మా ఽధురి, డాక్టర్ భగీరథి, గాయత్రీదేవి, పద్మజ, అంజల, జగన్నాథరావు, దినేష్‌కుమా ర్, సామా సుబ్బారావు, పద్మ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 27 , 2024 | 01:32 AM