ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కొమ్మమూరు కాలువకు సాగునీరు విడుదల

ABN, Publish Date - Jan 06 , 2024 | 10:32 PM

కొమ్మమూరు కాలువకు సాగునీరు విడుదల చేశారు. ఆయకట్టు పరిధిలో ఈఏడాది ఖరీఫ్‌లో మాగాణి భూముల్లో నాట్లు వేశారు. ఆతరువాత నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఆయ కట్టు పరిధిలో మాగాణి సాగుచేయవద్దని అధికారులు చెప్పారు. కొద్ది రోజులు వారబందీ ప్రకారం సాగునీరు అందిస్తామని, ఆతరువాత సాగునీరు ఏమాత్రం ఇవ్వలేమని తెలిపారు. మాగాణికి ప్రత్యామ్నా య పంటలను సాగుచేసుకోవాలని సూచించారు.

కొమ్మమూరు కాలువలో నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తున్న రైతులు

- బెట్టకొచ్చిన వరి

- తడులకు ఆస్కారం

- ఊపిరి పీల్చుకుంటున్న రైతులు

చీరాల, జనవరి 6: కొమ్మమూరు కాలువకు సాగునీరు విడుదల చేశారు. ఆయకట్టు పరిధిలో ఈఏడాది ఖరీఫ్‌లో మాగాణి భూముల్లో నాట్లు వేశారు. ఆతరువాత నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఆయ కట్టు పరిధిలో మాగాణి సాగుచేయవద్దని అధికారులు చెప్పారు. కొద్ది రోజులు వారబందీ ప్రకారం సాగునీరు అందిస్తామని, ఆతరువాత సాగునీరు ఏమాత్రం ఇవ్వలేమని తెలిపారు. మాగాణికి ప్రత్యామ్నా య పంటలను సాగుచేసుకోవాలని సూచించారు. అయితే, అప్పటికే కారంచేడు, చీరాల, వేటపాలెం, నాగులుప్పలపాడు మండలాల్లో ఖరీ ఫ్‌ చివర, రబీ తొలినాళ్లలో నాట్లు వేశారు. చీరాల, వేటపాలెం మండలాల పరిధిలో ఎత్తిపోతల పథకాల కింద మాగాణి చేశారు. ఆ తరువాత వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.

ఇటీవల తుఫాన్‌ నేపథ్యంలో కురిసిన వర్షాలు తప్ప మాగాణి పై రుకు తడి అనేది లేకుండా పోయింది. ప్రస్తుతం సాగులో ఉన్న వరి చేలు పొట్టదశలో ఉన్నాయి. కొన్ని చోట్ల కంకులు ఈనుతున్నాయి. ఈదశలో పైరుకు సాగునీరు అత్యంత అవసరం. కొమ్మమూరు కాలువలో సాగునీరు సక్రమంగా లేకపోవటంతో తడి ఇవ్వలేకపో యారు. దీంతో మాగాణి చేలు బీటలు వారాయి. ఈక్రమంలో పలు గ్రామాల రైతులు మాగాణికి ప్రస్తుతం తడి ఇచ్చేందుకు అవసర మైన సాగునీరు విడుదలచేయించి తమను ఆదుకోవాలని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తికి విజ్ఞప్తి చేశారు.

ఈనేపథ్యంలో ఎమ్మెల్యే బలరాం సాగునీటి పారుదలశాఖ ఈఎన్‌ సీ నారాయణరెడ్డితో నాలుగు రోజుల క్రితం ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం పైరు పొట్ట దశలో ఉండటంతో, నీటి తడి ఆవశ్యకతను బలరాం ఈన్‌సీకి వివరించారు. సాగునీరు అందించలేమని చెప్పి నప్పటికీ ప్రస్తుత పరిస్ధితుల్లో సాగులో ఉన్న మాగాణి పైరును కాపాడుకునేందుకు తడి ఇవ్వకుంటే జరిగే భారీ నష్టాన్ని, తద్వారా రైతులకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను చెప్పటంతో ఈఎన్‌సీ సానుకూలంగా స్పందించారు. బలరాం సూచన మేరకు తిమ్మసము ద్రం సర్పంచ్‌ కరణం రమేష్‌బాబు, మరికొన్ని గ్రామాల రైతులు ఈఎన్‌సీని కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వినతిపత్రం అంద జేశారు. దీంతో అధికారులు కొమ్మమూరు కాలువకు సాగునీటిని వి డుదల చేశారు. శనివారం సాయంత్రానికి నర్శాయపాలెం లాకుల ప్రాంతానికి కొమ్మమూరు కాలువలో నీరు చేరింది. అక్కడనుంచి ఆది, సోమ వారాల్లో కారంచేడు, చీరాల, వేటపాలెం, నాగులుప్పలపాడు మండలాల పరిధిలోకి సాగునీరు చేరనుంది. దీంతో తమ పైరును కాపాడుకునేందుకు ఆస్కారం లభించిందని సాగుదారులు పేర్కొంటున్నారు.

Updated Date - Jan 06 , 2024 | 10:32 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising