ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చీరాల ఆర్డీవో బదిలీ

ABN, Publish Date - Oct 25 , 2024 | 12:56 AM

ప్రభుత్వం గురువారం ఆర్డీవోల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చింది. అందులో చీరాల ఆర్డీవో దేవరకొండ అఖిలను రామచంద్రాపురం ఆర్డీవోగా బదిలీ చేశారు. తిరుపతి ప్రోటోకాల్‌-2 డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న తుమాటి చంద్రశేఖర్‌నాయుడును చీరాల ఆర్డీవోగా నియమిస్తూ ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఈ నెల 4న బాధ్యతలు స్వీకరించిన అఖిల

రామచంద్రాపురానికి పంపిస్తూ ఉత్తర్వులు

కేవలం 21 రోజుల వ్యవధిలో బదిలీపై రాజకీయ వర్గాలు, అధికారుల్లో చర్చ

చీరాల, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం గురువారం ఆర్డీవోల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చింది. అందులో చీరాల ఆర్డీవో దేవరకొండ అఖిలను రామచంద్రాపురం ఆర్డీవోగా బదిలీ చేశారు. తిరుపతి ప్రోటోకాల్‌-2 డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న తుమాటి చంద్రశేఖర్‌నాయుడును చీరాల ఆర్డీవోగా నియమిస్తూ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈనెల 4వ తేదీన దేవరకొండ అఖిల చీరాల ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఆమెను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కేవలం 21 రోజుల కాలవ్యవధిలో ఆర్డీవో బదిలీ కావడంపై అటు రాజకీయ, ఇటు అధికారుల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల బాపట్ల కలెక్టరేట్‌లో జరిగిన సమావేశం అనంతరం ఓ మంత్రి ఆర్డీవో అఖిలను జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచించినట్లు సమాచారం. అయితే అఖిల బదిలీకి తానే ప్రయత్నం చేసినట్లు, ఆ క్రమంలోనే ఆమె బదిలీ జరిగినట్లు రెవెన్యూ వర్గాలు చెప్పుకుంటున్నారు. ఆర్డీవో అఖిల భర్త అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట ఆర్డీవోగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామచంద్రాపురం బదిలీకి అవకాశం లభించడంతో ఆమె ప్రయత్నం మేరకే ఇది జరిగినట్లు తెలిసింది. అందుకు ఆ మంత్రి కూడా సహకరించినట్లు విశ్వసనీయ సమాచారం.

Updated Date - Oct 25 , 2024 | 12:56 AM