ప్రజా సమస్యలు పరిష్కరించాలి
ABN, Publish Date - Nov 25 , 2024 | 11:35 PM
గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి అధికా రులు చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించా రు. సోమవారం బల్లికురవ మండల కేం ద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రామ సభకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. ముందుగా శాఖలవారీగా ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, రాబోవు రోజుల్లో చేపట్టే సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద తక్షణమే పనులు ప్రారంభించాలన్నారు.
ఉపాధిలో బోగస్ మస్టర్‌లు, బియ్యం అక్రమ తరలింపుపై
ఉపేక్షించేది లేదు
మంత్రి గొట్టిపాటి
బల్లికురవ, నవంబరు 25 (ఆంద్రజ్యోతి) : గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి అధికా రులు చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించా రు. సోమవారం బల్లికురవ మండల కేం ద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రామ సభకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. ముందుగా శాఖలవారీగా ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, రాబోవు రోజుల్లో చేపట్టే సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద తక్షణమే పనులు ప్రారంభించాలన్నారు. పనులు ఎ క్కువ చేస్తేనే రోడ్లకు నిధులు మంజూరవుతాయన్నారు. గత వైసీపీ పాలనలో చేసినట్లు బోగస్ మస్లర్‌లు వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజమైన కూలీలకు 100 రోజుల పని దినాలు కేటాయించాలన్నా రు. రేషన్ బియ్యం అక్రమ మార్గంలో తరలిస్తే ఎంతటి వారైనా వదలొద్దన్నారు. రోడ్ల వెంబడి గ్రానైట్ వ్యర్థాలు వేస్తే సంబంధిత ఫ్యాక్టరీలు, క్వారీల వారికి నోటీసులిచిచ చ ర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతు సేవా కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు. గోకులం షెడ్లు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మంజూరు చేయిస్తామన్నారు. అర్హులైన ప్రజలందరికీ పక్కా గృహాలు కేటాయిస్తామని, యూనిట్ ధర ఎంత అనేది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉందన్నారు. జనవరి నుంచి నూతన పింఛన్‌లు మంజూరు చేస్తారన్నారు. ఎంపీడీవో కార్యాలయ నిధులను వైసీపీ హయాంలో అడ్డగోలుగా దోచుకున్నారని, నిధులు లేకుం డా రెండు కోట్లకు తూతు మంత్రంగా మట్టి రోడ్లు వేశారని తక్షణమే అన్ని రోడ్లను పరిశీలించి పనులు నాణ్యతగా ఉంటేనే బిల్లులు చెల్లించాలని పంచాయతీ రాజ్ ఏఈ మాధవ్‌కు సూచించారు. తాగు నీరు అందించే సీపీడడ్ల్యూ పథకం ద్వారా పనిచేసే పథకాలకు తక్కువకు టెండర్ వేసే వారితో డిపాజిట్ చేయించుకోవాలని, ఎక్కడా నీటి కొరత రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలలో విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నదృష్టా గ్రామాల్లో పర్యటించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎస్‌ఎల్ గుడిపాడులో ఉన్న సిపాయి కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలను పూర్తిస్థాయిలో చేపట్టేలా నిధులను మంజూరు చేయిస్తామన్నారు. అనంతరం మంత్రి రవికుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో చీరాల అర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, తహసీల్దార్ కవిత, ఎంపీడీవో కుసుమకుమారి, ఎంపీపీ శ్రీలక్ష్మీ, సర్పంచ్ అంజిబాబు, టీడీపీ మండల నాయకులు మలినేని గోవిందరావు, కొండేటి ఇజ్రాయల్, గొట్టిపాటి లక్ష్మయ్య, చింతల శ్రీనివాసరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
మంత్రి దృష్టికి సమస్యల వెల్లువ
తొలిసారిగా వచ్చిన మంత్రికి పలు గ్రామాల ప్రజలు సమస్యలను చెప్పుకు న్నారు. నక్కబొక్కలపాడు గ్రామానికి చెం దిన రైతులు పశువైద్యశాలను బల్లికురవకు కేటయించాలన్నారు. బల్లికురవ - మార్టూరు రోడ్డును అభివృద్ధి చేయాలని కోరారు. జూనియర్ కళాశాలకు బాలుర హాస్టల్‌ను మంజూరు చేయాలని కోరారు. కస్తూర్బా ఆటస్థలాన్ని అభివృద్ధి చేయాలని అధ్యాప కులు విజ్ఞప్తి చేశారు. అద్దంకి నుండి కొణిదెన చిలకలూరిపేట నైట్ బస్సును పునరుద్ధరించాలని, వల్లాపల్లి పాఠశాలలో అదనపు తరగతి గదులను నిర్మించాలని ఉపాధ్యాయులు మంత్రి దృష్టికి తెచ్చారు.
సీఎం సహాయం అందజేత
నియెజకవర్గంలోని పలు గ్రామాలకు చెం దిన 55 మందికి సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రి గొట్టిపాటి అందజేశారు. రూ.కోటీ 11అక్షల 32వేలకు ఎల్‌వోసీలను అందజేశారు. ఇప్పటి వరకు నియెజకవర్గం లో 123 మందికి రెండు కోట్ల మేర చెక్కులను అందజేసిన్నట్లు మంత్రి తెలిపారు.
Updated Date - Nov 25 , 2024 | 11:36 PM