ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తీరాన్ని కాపాడడం అందరి బాధ్యత

ABN, Publish Date - Sep 21 , 2024 | 11:44 PM

తీరప్రాంతంలో సముద్రం ప్రశాంతతను కాపాడడం, కాలుష్య రహిత వాతావరణం అందరి బాధ్యతను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. మండల పరిధిలోని పొట్టి సుబ్బయ్యపాలెం సముద్రతీరం వద్ద శనివారం మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సాగర్‌ - సురక్షిత్‌ సాగర్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఎమ్మెల్యే కొండయ్య

వేటపాలెం(చీరాల), సెప్టెంబరు 21 : తీరప్రాంతంలో సముద్రం ప్రశాంతతను కాపాడడం, కాలుష్య రహిత వాతావరణం అందరి బాధ్యతను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. మండల పరిధిలోని పొట్టి సుబ్బయ్యపాలెం సముద్రతీరం వద్ద శనివారం మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సాగర్‌ - సురక్షిత్‌ సాగర్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళి మనుగడకు ప్రకృతి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రకృతికి విరుద్ధంగా మానవ మనుగడ సాగలేదన్నారు. సముద్రానికి వచ్చే పర్యాటకులు తీరంలో ప్రశాంత, పరిశుభ్ర వాతావరణానికి భంగం కలగకుండా మసలుకోవాలన్నారు. వ్యర్థాలను తీరంలో వేస్తూ, ప్రధానంగా ప్లాస్టిక్‌ కారణంగా నెలకునే ప్రతికూల పరిస్థితులను వివరించారు. ఇంటిని, ఒంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో, తీరాలను కూడా అలానే పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ సందర్భంగా తీరంలో విద్యుత్‌ లైట్లు వేయించాలని స్థానికులు కోరగా ఎమ్మెల్యే కొండయ్య వెంటనే పంచాయతీ అధికారులకు చెప్పారు. కార్యక్రమంలో మత్స్యకార సంక్షేమ సమితి బాధ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 11:44 PM