ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు

ABN, Publish Date - Apr 03 , 2024 | 01:19 AM

తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ సింగరాయకొండ వాసులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో స్థానిక కందుకూరు రోడ్డులో నిరసన చేపట్టారు.

ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న ప్రజలు

సింగరాయకొండలో ఖాళీ బిందెలతో నిరసన

రెండు వారాలుగా సరఫరా లేకపోవడంపై ఆగ్రహం

సమస్యను పరిష్కరించకుంటే పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక

సింగరాయకొండ, ఏప్రిల్‌ 2 : తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ సింగరాయకొండ వాసులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో స్థానిక కందుకూరు రోడ్డులో నిరసన చేపట్టారు. వెంటనే సమస్యను పరిష్క రించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన నాయకులు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే స్వామి సింగరాయకొండకు రామతీర్థం నీటిని తీసుకొచ్చి ప్రజల ఇక్కట్లను తొలగించారని తెలిపారు. వైసీపీ అధికారం లోకి వచ్చిన నాటి నుంచి ఆపార్టీ నాయకుల అసమర్థత కారణంగా గ్రామానికి తాగునీరు సక్రమంగా రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వైసీపీ నాయకులు, అధికారులు కలిసి రామతీర్థం పథకాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రెండు రోజుల్లో నీరు ఇవ్వకపోతే పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కూనపరెడ్డి సుబ్బారావు, ఓలేటి రవిశంకర్‌రెడ్డి, కళ్లగుంట నరసింహ, పూనూరి నరేష్‌, యస్థాని, బచ్చే, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు రాజేష్‌, కాసుల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 01:19 AM

Advertising
Advertising