రైల్వే మంత్రికి ఎంపీ వినతి
ABN, Publish Date - Nov 26 , 2024 | 11:19 PM
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌ను మంగళవారం బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కలిసి, పలు అంశాలపై వినతిపత్రం అందజేశారని ఎంపీ కార్యాలయ ప్రతినిధి తెలిపారు.
కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌కు వినతిని అందజేస్తున్న ఎంపీ కృష్ణప్రసాద్
చీరాల, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌ను మంగళవారం బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కలిసి, పలు అంశాలపై వినతిపత్రం అందజేశారని ఎంపీ కార్యాలయ ప్రతినిధి తెలిపారు. వందేభారత్ రైలు కు చీరాల స్టాపింగ్ ఇవ్వాలని, విజయవాడ, గూడురు మధ్య నాలుగవ లైన్ నిర్మాణం, రేపల్లె, తెనాలి మధ్య రెండవ లైన్ నిర్మాణం, రేపల్లె, బాపట్ల మధ్య కొత్త లైన్ నిర్మాణం చేపట్టాలని ఆ వినతిపత్రంలో పేర్కొన్నట్లు కార్యాలయ ప్రతినిధి తెలిపారు.
Updated Date - Nov 26 , 2024 | 11:19 PM