ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్వర్ణాంధ్రపై రేపు ప్రజాప్రతినిధులతో సమావేశం

ABN, Publish Date - Oct 06 , 2024 | 11:32 PM

స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికపై మంగళవారం జిల్లాలోని కీలక ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరగనుంది.

ఒంగోలు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికపై మంగళవారం జిల్లాలోని కీలక ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరగనుంది. వికసిత భారత్‌-2047 పేరుతో కేంద్రం, స్వర్ణాంధ్ర పేరుతో రాష్ట్రప్రభుత్వాలు విజన్‌ డాక్యుమెంట్లు రూపొందిస్తున్నాయి. రాష్ట్ర ప్రణాళికను నవంబరు1న విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించి వివిధ వర్గాల ప్రజల నుంచి సలహాలు, సూచనలను తీసుకుంటున్నారు. అందులో భాగంగా అన్ని జిల్లాల్లో కీలక ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. తదనుగుణంగా ఈనెల 8న జిల్లాస్థాయి సమావేశాన్ని కలెక్టర్‌ అన్సారియా ఏర్పాటు చేశారు. ఆరోజు ఉదయం 11 గంటలకు ప్రకాశం భవన్‌లోని స్పందన హాలులో ఈ సమావేశం జరగనుంది. జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానం పంపారు.

Updated Date - Oct 06 , 2024 | 11:32 PM