ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మద్యం దొంగలు దొరికారు!

ABN, Publish Date - Mar 28 , 2024 | 02:12 AM

ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి బెల్టుషాపునకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు.

మద్యం బాటిళ్లు, అరెస్టు చేసిన ప్రభుత్వ వైన్‌షాపు సిబ్బందితో ఎస్‌ఈబీ అధికారులు

ప్రభుత్వ వైన్‌షాపు నుంచే బెల్ట్‌ దుకాణానికి సరఫరా

288 క్వార్టర్‌ బాటిళ్లను పట్టుకున్న ఎస్‌ఈబీ అధికారులు

సిబ్బందిపై కేసులు

కంభం, మార్చి 27 : ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి బెల్టుషాపునకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. రూ.45వేల విలువైన సరుకును, ప్రభుత్వ దుకాణంలో పనిచేసే ఇద్దరు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలను ఎస్‌ఈబీ డీఎస్పీ దుర్గాప్రసాద్‌ విలేకరులకు బుధవారం వివరించారు. ఆయన కథనం మేరకు.. అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్‌వైజర్‌గా పనిచేసే కొప్పుల వెంకట రమేష్‌, వాచ్‌మన్‌గా పనిచేస్తున్న దార్ల అనిల్‌, యాచవరంలో బెల్టుషాపు నిర్వహిస్తున్న యామా చిన్నవెంకటేశ్వర్లు కలిసి బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సుమారు రూ.48వేల విలువైన 288 క్వార్టర్‌ బాటిళ్లను కారులో యాచవరం బెల్టుషాపునకు తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న కంభం ఎస్‌ఈబీ సీఐ బాలకృష్ణ, ఎస్సై సత్యనారాయణరావు పోతురాజుటూరు గ్రామసమీపంలో మాటువేశారు. అటువైపు వస్తున్న కారును నిలిపి తనిఖీ చేయగా మద్యం బాటిళ్లు దొరికాయి. కారుతోపాటు రమేష్‌, అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం సీసాలు, కారు, నిందితులను గిద్దలూరులో కోర్టు హాజరుపరిచినట్లు డీఎస్పీ చెప్పారు.

Updated Date - Mar 28 , 2024 | 02:12 AM

Advertising
Advertising