రామరాజ్యం స్థాపిద్దాం
ABN, Publish Date - Jan 18 , 2024 | 10:45 PM
తెలుగుజాతికి ఎన్టీయార్ కీర్తి శిఖరం వంటివారని, ఆయన ఆశయ సాధన కోసం, రామరాజ్య స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారె డ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉగ్ర మాట్లాడుతూ ఎన్టీఆర్ అటు సినిమా, ఇటు రాజకీయ రంగాల్లో విప్లవాత్మక మార్పులను తెచ్చారన్నారు. రూ.2కే కిలో బియ్యం పథకంలో పేదల ఆకలితీర్చిన గొప్ప వ్యక్తి అన్నారు. పార్టీలు మారినా ఆ పథకాన్ని కొనసాగించడం ఆయన ఆదర్శానికి నిదర్శనమన్నారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర పిలుపు
గ్రామగ్రామాన ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు
పెద్దఎత్తున పాల్గొన్న టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు
భారీ ఎత్తున అన్నదానాలు, సేవా కార్యక్రమాలు
కనిగిరి, జనవరి 18: తెలుగుజాతికి ఎన్టీయార్ కీర్తి శిఖరం వంటివారని, ఆయన ఆశయ సాధన కోసం, రామరాజ్య స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారె డ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉగ్ర మాట్లాడుతూ ఎన్టీఆర్ అటు సినిమా, ఇటు రాజకీయ రంగాల్లో విప్లవాత్మక మార్పులను తెచ్చారన్నారు. రూ.2కే కిలో బియ్యం పథకంలో పేదల ఆకలితీర్చిన గొప్ప వ్యక్తి అన్నారు. పార్టీలు మారినా ఆ పథకాన్ని కొనసాగించడం ఆయన ఆదర్శానికి నిదర్శనమన్నారు. టీడీపీ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం, అన్నికులాలకు సముచిత స్థానం దక్కిందన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళలు, నాయకులు నం బుల వెంకటేశ్వర్లు, చావలి చినవెంకటేశ్వర్లుయాదవ్, మూలే బాలిరెడ్డి, గుడిపాటి ఖాదర్, సిద్దాంతి బారాయిమాం, యలమంద, మారుతీ, కాసుల శ్రీరాంయాదవ్ పాల్గొన్నారు.
అభిమానుల అధ్వర్యంలో..
ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వ ర్యంలో వైఎ స్సార్ రోడ్డులో ఘ నంగా ఎన్టీయార్ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమాని కి ఉగ్ర ముఖ్య అతి థిగా హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమం లో ఎన్టీఆర్ అభిమానులు ఎస్థానీబాషా (పులి), ఉంగరాల బాషా, తాతపూడి ఐజాక్, నజిముద్దీన్, తిరుపాలు, చిలకపాటి లక్ష్మయ్య, గిఫ్ట్ ఆర్టికల్స్ కొండలు, బడేబాయి, నన్నేబాయి, మస్తాన్ పాల్గొన్నారు.
పామూరు : మరణంలేని మహా మనిషి ఎన్టీఆర్ అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. పలు గ్రామాల్లో ఎన్టీఆ ర్ వర్ధంతి కార్యక్రమాల్లో ఉగ్ర పాల్గొన్నారు. కంభాలదిన్నెలో ఎన్టీఆర్ విగ్రహానికి ఉగ్ర పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందరర్భం గా ఉగ్ర మాట్లాడుతూ తెలుగువారి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిచెప్పి ప్రజల గుండెల్లో చె రగని ముద్ర వేసుకున్న మహానేత ఎన్టీఆర్ అన్నారు. తెలుగు యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రా రంభించారు. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ మండల క మిటీ అ ధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వ ర్లు, ఎంపీటీసీ సభ్యుడు బొ ల్లా నరసింహారావు పూలమాలవేసి నివాళులర్పించా రు. అనంతరం టీడీపీ నా యకులు యారవ శ్రీను ఆ ర్థిక సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. చిలంకూరు, బొట్లగూడూరు గ్రామాల్లో ఎన్టీఆర్ వ ర్ధంతి కార్యక్రమాలు నిర్వహించా రు. కార్యక్రమాల్లో అడుసుమల్లి ప్రభాకర్‌చౌదరి, షే క్ ఖాజారహంతుల్లా, ఉప్పలపాటి హరిబాబు, షేక్ గౌస్‌బాషా, పందిటి హరీష్, పా లపర్తి వెంకటేశ్వర్లు, పు వ్వాడి రామారావు. ముబినామౌలాలి, దేవరపు మా ల్యాద్రి, ఇర్రి కోటిరెడ్డి, చినహజరత్, కొంపెళ్లి రా జేం ద్ర, కౌలూరి రహంతుల్లా, మస్తాన్, నరసింహారావు, దైండే శివశంకర్, బీ సత్యం, హరిప్రసాద్, వేమూరి నవీన్, వినోద్, కావేరి రసూల్, మహిళా నాయకులు రమాదేవి, సుబ్బమ్మ, రమణమ్మ, నాగమని పాల్గొన్నారు. కం భాలదిన్నె కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు మ న్నం రమణయ్య, ఏలూరి వెంకటేశ్వర్లు, అడుసుమల్లి న రసింహులు, గంగయ్యచౌదరి, కొండయ్య, వెంకటేశ్వర్లు, బాలకృష్ణ, భాస్కర్, చౌదరిబాబు, కొండయ్య, రమేష్ పాల్గొన్నారు.
వెలిగండ్ల : టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భం గా వెలిగండ్లలో ఎన్టీఆర్ విగ్రహానికి గురువారం మాజీ ఎ మ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డా క్టర్ ఉగ్ర నరసింహారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉగ్ర మాట్లాడుతూ పేదల కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను తీ సుకొచ్చారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉగ్ర పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ క్లస్టర్ ఇ న్‌చార్జి దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, జిల్లా అఽధికార ప్రతినిధి గవదకట్ల హరి, మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు కేలం ఇంద్ర భూపాల్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గొనా ప్రతాప్, కొండు భా స్కర్ రెడ్డి, శ్రీను, పుల్లారెడ్డి, కేసరి రమాణా రెడ్డి, మాలకొండారెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి సలొమన్ రాజు, రవి, తెలుగు రైతు అధ్యక్షుడు కాశ య్య, వెంకటేశ్వర్లు, మాలకోండారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
ఎన్టీఆర్ విగ్రహానికి పాలభిషేకం
పీసీపల్లి, : పీసీపల్లి, వెంగళాయపల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలభిషేకం చేసి, పూలమాలలువేసి ఘ నంగా నివాళులర్పించారు. పీసీపల్లి ఎన్టీఆర్ విగ్ర హం సెంటరులో టీడీపీ జెండాను ఎగురవేశారు. మండల నాయకులు మా ట్లాడుతూ సినీ, రాజకీయ రంగాల్లో ధ్రువతారగా వెలిగి తెలుగువారి కీర్తిని ప్రపంచ నలుమూలలా వి స్తరించిన మహోన్నత వ్య క్తి ఎన్టీఆర్ అన్నారు. కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షుడు వే మూరి రా మయ్య, గోగడి ర త్నయ్య, వీరపనేని పెద్దన్న, మూలె సత్తిరెడ్డి, వీరపనేని నానిబాబు, బద్దిపూడి ఎబినేజరు, మలినేని వెంకటేశ్వర్లు,మారెళ్ల మాలకొండయ్య, కోమటి గుంట్ల వీ రయ్య, ఉప్పుగుండ్ల శివరామయ్య, నాగేశ్వరరావు, కసిరెడ్డి హనుమారెడ్డి, పల్లా మల్లికార్జున, చాగంరెడ్డి మాలకొండారెడ్డి, పెదబ్రహ్మయ్య, కొండపనాయుడు, మహేష్, మహేంద్ర, బ్రహ్మయ్య, పె ద్దిరెడ్డి క్రిష్ణారెడ్డి, రమణ య్య, మా ల్యాద్రి, వీరాంజనేయులు, నాగేంద్రబాబు ఉన్నారు.
ఎన్టీఆర్‌కు నివాళి
దర్శి : ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను మండలంలో గురువారం ఘనంగా నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్ వద్ద ఎన్టీఆర్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి శ్రీరాములు విగ్రహాలకు జిల్లా టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, పరిశీలకుడు నాదెండ్ల బ్రహ్మంచౌదరి, గోరంట్ల రవికుమార్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పీజీఎన్ క్లబ్ ఆవరణలో అన్నదానం నిర్వహించారు. తెలుగుజాతి ఖ్యాతిని దిశదశల ఇనుమడింపజేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని నేతలు కొనియాడారు. ఆయన ఆశయాలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు యాదగిరి వాసు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు సంగా తిరుపతిరావు, మారెళ్ల వెంకటేశ్వర్లు, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్, జిల్లా తెలుగు మహిళా నాయకురాలు ఎం శోభారాణి, మాజీ ఎంపీపీ ఫణిదపు వెంకటరామయ్య, క్లస్టర్ ఇన్‌చార్జి నారపుశెట్టి మధు, గుర్రం బాలకృష్ణ, సందు రామయ్య పాల్గొన్నారు. అలాగే తూర్పువీరాయపాలెం, బోట్లపాలెం గ్రామాల్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను, అన్నదానాలను నిర్వహించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు గరికపాటి గోపి, పవన్ తదితరులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
కోలాహలంగా వేడుకలు
దొనకొండ : మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా బాణసంచా కాల్చుతూ కోలాహలంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి అక్కడ నుంచి రెండు వర్గాల వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో దొనకొండలోని ప్రధాన రహదారి మొత్తం పసుపుమయమైంది. టీడీపీ మండల అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు నేతృత్వంలో నాయకులు మోడి వెంకటేశ్వర్లు, కొత్తం రఘునాథరెడ్డి, వల్లపునేని వెంకటస్వామి, పత్తి వెంకటేశ్వర్లు, షేక్ తోహిద్, వడ్లమూడి చెన్నయ్య, విప్పర్ల లక్ష్మీరావు, కొమ్మతోటి సుబ్బారావు, శృం గారపు నాగసుబ్బారెడ్డి, యరగొర్ల బసవయ్య, దుగ్గెంపూడి చెంచయ్య, యగ్గోని యల్లారెడ్డి, మన్నెం గాలెయ్య, నిమ్మకాయల సుబ్బారెడ్డి, పోతిపోగు చెన్నయ్య, వల్లపునేని కేశవ మరికొందరు నాయకులు ఎన్టీఆర్ విగ్రహంకు పూలమాల వేసి నివాళులర్పించి భారీ అన్నదాన కార్యక్రమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ యువనాయకుడు వెంకన్నచౌదరి ఆధ్వర్యం లో జడ్పీటీసీ మాజీ సభ్యుడు పులిమి రమణాయాదవ్, నాయకులు కామేపల్లి చెంచయ్య, తాండ్ర వెంకటేశ్వర్లు, తోటా కోటేశ్వరరావు, వల్లపునేని ఆదినారాయణ, ఫణిదపు అనంతరాములు, వేగినాటి అల్లూరయ్య, ఫణిదపు వీరాంజనేయులు, వైకే చౌదరి, షేక్ సుభాని, దుగ్గెంపూడి కోటేశ్వరరావు, పురుషోత్తం స త్యానందం, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి, వేదిక వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారీ అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.
సీనియర్ నాయకులకు ఘన సన్మానం
టీడీపీ యువ నాయకుడు వెంకన్నచౌదరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మండలంలో టీడీపీకి విశిష్ట సేవలందించిన సీనియర్ నాయకు డు దుగ్గెంపూడి కాశయ్య, పులిమి రమణాయాదవ్, షేక్ మగ్భూల్ అహమ్మ ద్, షేక్ ముసామియా(సర్దార్), డాక్టర్ మల్లికార్జునశర్మ, నూనె విజయకుమా రి, షేక్ సుభాని, బత్తుల గాలయ్య, జనసేన మండల, పట్టణ అధ్యక్షుడు నాగేంద్రప్రసాద్, షఫీ ఉల్లాఖాన్ (బాజీ)కి శాలువాలు కప్పి సన్మానించారు.
తాళ్లూరు : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసి ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ ఆరాధ్య దైవంగా నిలిచారని టీడీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నూకసాని బాలాజీ అన్నారు. తాళ్లూరు, తూర్పుగంగవరం గ్రామాల్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదానాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమాల్లో నాయకులు గోరంట్ల రవికుమార్, నాదెండ్ల బ్రహ్మంచౌదరి, బొమ్మిరెడ్డి ఓబుల్‌రెడ్డి, వల్లభనేని సుబ్బయ్య, మానం రమే్‌షబాబు, శాగంకొండారెడ్డి, తూర్పుగంగవరం నాయకుడు కనిశెట్టి రామలక్ష్మయ్య, షేక్ కాలేషావలి, గొలంలపూడి వేణుబాబు, షేక్‌మీరామొహిద్దీన్, చెన్నపురెడ్డి వీరనాగిరెడ్డి, మేడగం వెంకటేశ్వరరెడ్డి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కూటాల ప్రసాద్, టీడీపీ నేతలు శ్రీనివాసరెడ్డి, మారాబత్తుల సుజాత, కోట అంకమ్మ, మెలికా అంజమ్మ పాల్గొన్నారు.
కురిచేడు : ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను పోటాపోటీగా నిర్వహించా రు. ఎంపీడీవో ఆఫీస్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే నారపుసెట్టి పాపారావు, మండల అధ్యక్షుడు నెమిలయ్య పాల్గొన్నారు. అన్నదానం, పాటకచేరీని ఏర్పాటు చేశారు.
ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్
ముండ్లమూరు : ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ అన్నారు. గురువారం ఎన్టీఆర్ వ ర్ధంతి సందర్భంగా ముండ్లమూరు, పసుపుగల్లు గ్రామాల్లో విగ్రహాలకు పూ లమాలలు వేసి నివాళులర్పించారు. బాలాజీ మాట్లాడుతూ పేద ప్రజలకు కిలో రూ.2కే బియ్యం ఇచ్చి గుండెల్లో చిర స్థాయిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో టీడీపీ దర్శి నియోజకవర్గ నాయకులు గోరంట్ల రవి కుమార్, పరిశీలకుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి, టీడీపీ మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు నాగరాజు, వరగాని పౌలు, మాజీ అధ్యక్షుడు సోమేపల్లి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్‌లు ఇందూరి పిచ్చిరెడ్డి, నిడమానూరి శ్రీనివాసరావు, జిల్లెలమూడి చౌదరి, చిననారాయణరెడ్డి, సర్పంచ్‌లు సుబ్బారెడ్డి, కూరపాటి నారాయణ స్వామి పాల్గొన్నారు. శంకరాపురంలో మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు ఎన్‌టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. మారెళ్ల బస్టాండ్ సెంటర్‌లో ఎన్‌టీఆర్ విగ్రహానికి ఎంపీటీసీ సభ్యుడు పాలపర్తి సుబ్బారావు, సుంకర రాఘవరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే తూర్పుకంభంపాడు, శంకరాపురంలో మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు ఆధ్వర్యంలో నివాళులర్పించి, అన్నదానం ఏర్పాటు చేశారు.
వెంకట్ ఆధ్వర్యంలో అన్నదానం
జనసేన పార్టీ దర్శి నియోజక వర్గ నాయకుడు గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముండ్లమూరు, పె ద ఉల్లగల్లులో పెద్ద ఎ త్తున అన్నదాన కార్యక్ర మం నిర్వహించారు. వెంకట్ సోదరుడు పవన్, గోపీ ఆధ్వర్యంలో విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Updated Date - Jan 18 , 2024 | 10:45 PM