ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కూటమితోనే రాష్ట్రానికి జవసత్వాలు

ABN, Publish Date - Mar 29 , 2024 | 12:46 AM

వైసీపీ ప్రభుత్వ పాలనలో దివాళా తీసిన రాష్ర్టానికి జనసత్వాలు అందించాలన్న లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు.

గ్రామాల నేతలతో సమీక్ష నిర్వహిస్తున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

అద్దంకి, మార్చి 28: వైసీపీ ప్రభుత్వ పాలనలో దివాళా తీసిన రాష్ర్టానికి జనసత్వాలు అందించాలన్న లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. అద్దంకి మండలంలోని ధేనువకొండ, పేరాయపాలెం, మోదేపల్లి, కుంకుపాడు, కొటికలపూడి, తిమ్మాయపాలెం, రామాయపాలెం, వేలమూరిపాడు, కొంగపాడు, మణికేశ్వరం, విప్పర్లవారిపాలెం, నాగులపాడు, జార్లపాలెం, చెరువుకొమ్ముపాలెం, బొమ్మనంపాడు, ఉప్పలపాడు, గోవాడ త దితర గ్రామాల నేతలతో గురువారం పంగులూరు మండలం ముప్పవరం వద్ద ఉన్న క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. గుండ్లకమ్మ ముంపు గ్రామాలు, పునరావాస కాలనీల ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటిన్‌లు తెరిపిస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. టీడీపీ చేపట్టిన ప్రజాగళంతో వైసీపీ బంగాళాఖాతంలో కలిసి పోవటం ఖాయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు నాగినేని రామకృష్ణ, కరి పరమేష్‌, జొన్నలగొడ్డ గోపి, నర్రా వీరయ్య, గాలం శ్రీనావాసరావు, పూనాటి విక్రమ్‌, కంచర్ల వెంకటరావు, జ్యోతి రామారావు, మోటుపల్లి నాగేశ్వరరావు, దివికోలు రాధాకృఫ్ణమూర్తి, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:46 AM

Advertising
Advertising