క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగు
ABN, Publish Date - Jan 18 , 2024 | 10:49 PM
క్రీడలతో మానసిక ఉల్లాసంతోపాటు స్నేహ సంబంధాలు మెరుగుపడతాయని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. జనసేన పార్టీ పిలుపులో భాగంగా మన ఊరు - మన ఆట కార్యక్రమంలో భాగంగా మండలంలోని పెదయిర్లపాడులో మూడురోజులుగా జరిగిన జేపీఎల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతలకు గురువారం ఉగ్ర బహుమతులను అందజేశారు. పల్లెల్లో క్రీడలు నిర్వహించడం సంతోషంగా ఉం దన్నారు.
విజేతలకు బహుమతులు అందజేసిన డాక్టర్ ఉగ్ర
పీసీపల్లి, జనవరి 18 : క్రీడలతో మానసిక ఉల్లాసంతోపాటు స్నేహ సంబంధాలు మెరుగుపడతాయని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. జనసేన పార్టీ పిలుపులో భాగంగా మన ఊరు - మన ఆట కార్యక్రమంలో భాగంగా మండలంలోని పెదయిర్లపాడులో మూడురోజులుగా జరిగిన జేపీఎల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతలకు గురువారం ఉగ్ర బహుమతులను అందజేశారు. పల్లెల్లో క్రీడలు నిర్వహించడం సంతోషంగా ఉం దన్నారు. గెలుపు ఓటములను సమానవంగా స్వీకరించి మున్ముందుకు రాణించేలా కృషి చేయాలని క్రీడాకారులకు ఉగ్ర సూచించారు. అందరూ ఐక్య తతో గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో జనసేన జి ల్లా కార్యదర్శి రహిముల్లా, ప్రోగ్రామ్ కమిటీ కార్యదర్శి సునీల్, మాదాసు రమేష్, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఇది కష్టపడే సమయం
వెలిగండ్ల, జనవరి 18 : ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలకు ఇది కష్టపడే సమయమని, ప్రతి ఒక్కరూ ఐక్యతతో కలిసి పనిచేస్తే విజయం వరిస్తతందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో శ్రేణులతో సమావేశం నిర్వహించారు. టీడీపీ, జనసేన పార్టీ కూటమి గెలుపుతోనే రాష్ట్ర భవిష్యత్ సాధ్య మన్నారు. అన్నివర్గాల ప్రజల కష్టాలు తీరాలన్నా, ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకో వలిసిన అవసరాన్ని ప్రజలకు వి వరించాలని సూచించారు. పార్టీలోకి వలసలు పెరగుతున్న దృష్ట్యా వారిని క లుపుకొని అందరూ చురుగ్గా పనిచేయాలన్నారు. బూత్ స్థాయిలో అప్రమత్తం గా శ్రమించాలన్నారు. గ్రూపు రాజకీయాలకు తావి వ్వొద్దని హితవు చెప్పారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జి దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, జిల్లా అఽధికార ప్రతినిధి గవదకట్ల హరి, మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి, తెలుగు రైతు అధ్యక్షుడు ఇంద్రభూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, భాస్కర్ రెడ్డి, శ్రీ ను, పుల్లారె డ్డి, రమాణా రెడ్డి, మాలకొండారెడ్డి, ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి సలోమన్ రా జు, రవి, తెలుగు రైతు అధ్యక్షుడు కాశయ్య, వెంకటేశ్వర్లు, మాలకొండారెడ్డి, వెం కటేశ్వరరెడ్డి, జయరామిరెడ్డి, శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Jan 18 , 2024 | 10:49 PM