నిర్వహణ ఎలా?
ABN, Publish Date - Dec 04 , 2024 | 02:26 AM
సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణ జలవనరుల శాఖ అధికారులకు సమస్యగా మారింది. త్వరలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా ఒక్క పైసా కూడా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. స్థానికంగా జలవనరుల శాఖ పరిధిలో నిధులు అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ ఎలా అన్నది అర్థంకాక అధికారులు మల్లగుల్లాలు పడుతు న్నారు.
జలవనరులశాఖ అధికారుల మల్లగుల్లాలు
త్వరలో నీటి సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్
జిల్లాలో 342 డబ్ల్యూయూఏలు, 10 డీసీలు
వందలాది మంది సిబ్బందినియామకం
భారీగా వ్యయం అయ్యే పరిస్థితి
ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి రాలేదు
కనీస అవసరాలకు శాఖలో పైసా లేదు
ఒంగోలు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణ జలవనరుల శాఖ అధికారులకు సమస్యగా మారింది. త్వరలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా ఒక్క పైసా కూడా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. స్థానికంగా జలవనరుల శాఖ పరిధిలో నిధులు అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ ఎలా అన్నది అర్థంకాక అధికారులు మల్లగుల్లాలు పడుతు న్నారు. ఈ ఎన్నికలను రెవెన్యూ, జలవనరుల శాఖ భాగస్వామ్యంతో నిర్వహించాలి. అయితే సాగునీటి సంఘాలు, వాటి పరిధిలోని నీటి వనరులు, ఆస్తులు అన్నీ జలవనరుల శాఖకు చెందినవే కాగా కేవలం ఎన్నికల ప్రక్రియ వరకే రెవెన్యూ శాఖ భాగస్వామ్యం ఉం టుంది. దీంతో ఆ ప్రక్రియ అంతా జలవనరుల శాఖ అధికారులే చూడాల్సి ఉంది. నిధులు అందుబా టులో లేకపోవడమే కాక సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో ఆ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
1.10లక్షల మంది ఓటర్లు
జిల్లాలో మొత్తం 342 సాగునీటి వినియో గదారుల సంఘాలు (డబ్ల్యూయూఏ), పది డిస్ట్రిబ్యూటరీ కమిటీ(డీసీ)లు ఉన్నాయి. భారీ నీటిపారుదల విభాగంలో ఎన్నెస్పీ ఆయకట్టు ఉండగా ఆ పరిధిలో 88 డబ్ల్యూయూఏలు, 10 డీసీలు, మధ్యతరహా వనరుల పరిధిలో 14 డబ్ల్యూయూఏలు, కంభం చెరువు, మోపాడు రిజర్వాయర్, పీబీ ఆనకట్టకు ప్రాజెక్టు కమి టీలు, అలాగే చిన్ననీటి వనరుల విభాగంలో 240 చెరువులకు డబ్ల్యూయూఏలు ఉన్నాయి. వాటి పరిధిలో సుమారు లక్షా 10వేల మంది ఓటర్లుగా ఉన్నారు. తొలుత డబ్ల్యూయూఏ ఎన్నిక జరుగుతుంది. ఎన్నెస్పీలో అయితే ఒక్కో మేజర్ కింద ఉండే డబ్ల్యూయూఏ పరిధిలో 12 మంది ప్రాదేశిక సభ్యుల(టీసీల)ను, ఇతర వన రుల కింద ఎనిమిది మంది టీసీలను ఎన్నుకోవాలి. టీసీల నుంచి ఒక చైర్మన్, మరొక వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. డబ్ల్యూ యూఏ చైర్మన్ నుంచి ఒకరిని ఎన్నెస్పీలో డీసీ అధ్యక్షునిగా, మధ్యతరహా అయితే ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా ఎన్నుకుంటారు.
నిధులపై స్పష్టత కరువు
నిబంధనల ప్రకారం ఒక్కో డబ్ల్యూయూఏకి ఒక మండల స్థాయి గజిటెడ్ అధికారి ఎన్నికల అధికారిగా, మరొక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారితోపాటు ఒక్కో టీసీకి ఇద్దరేసి సిబ్బందిని నియమిస్తారు. అలా జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల కోసం వందలాది మంది ఉద్యోగుల సేవలు అవసరం. ఇక ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణ, అవసర మైతే పోలింగ్ కోసం ఒక్కో సంఘానికి ఒకచోట కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఇలా పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది నియామకం, శిక్షణ, పోలింగ్ సామగ్రి వంటి ఖర్చులకు లక్షలాది రూపాయలు అవసరమవుతుంది. పోలింగ్ నిర్వహణకు అటు సిబ్బందికి, ఇటు ఓటర్లకు ఏర్పాట్లు చేయాలి. అయితే ప్రభుత్వం ఇంతవరకు ఎన్నికల నిర్వహణ కోసం నిధులు ఇవ్వకపోగా, ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కూడా స్పష్టత ఇవ్వకపోడంతో ఇరిగేషన్ అధికారులు అయోమయంలో పడ్డారు.
ఎన్నికలు మరోసారి వాయిదా
సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు ముచ్చటగా మూడోసారి వాయిదా పడ్డాయి. తాజా షెడ్యూల్ ప్రకారం ఈనెల 5వతే దీన ఎన్నికలకు స్థానికంగా అధికారులు నోటిఫికేషన్ ఇచ్చి 8న డబ్ల్యూయూ ఏలకు, 11న డీసీలకు ఎన్నికలను నిర్వహించాలి. ఆ మేరకు సంబంధిత అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. అయితే తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎన్నికల నోటిఫి కేషన్ నిలిపివేయాలని మంగళవారం రాత్రి ప్రభుత్వం నుంచి కలెక్టర్‌కు సమాచారం అందింది. దీంతో ఇప్పటివరకు చేసిన ప్రక్రియను అధికారు లు తాత్కాలికంగా ఆపేశారు. కాగా కూటమి ప్రభుత్వం వచ్చి నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించాక ఇలా వాయిదా పడ టం ఇది మూడోసారి. తొలుత ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఇచ్చినప్పుడు బుడమేరు వరద పోటెత్తి విజయవాడ మునిగిపోవడం, ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు, వరదలతో అప్పట్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. రెండోసారి షెడ్యూల్‌ను ఇచ్చినప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరు గుతున్నాయి. ఈనేపథ్యంలో కీలకమైన ఈ ఎన్నికలపై ఎమ్మెల్యేలు దృష్టి సారించే అవకాశం ఉండదని భావించి వాయిదా వేశారు. మూడోసారి షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆప్రకారం ఈనెల 5న నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా మరోసారి వాయిదా వేస్తున్నట్లు మంగళవారం రాత్రి అధికారులకు సమాచారం అందింది. ప్రస్తుతం కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తుండటంతో ముందస్తు జాగ్రత్తగా ఎన్నికలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
Updated Date - Dec 04 , 2024 | 02:26 AM