ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జోరుగా ఇకసు అక్రమ రవాణా

ABN, Publish Date - Sep 29 , 2024 | 11:03 PM

కూటమి ప్రభుత్వంలోనూ వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఐదేళ్లుగా అడ్డగోలుగా ఇసుకను దోచుకున్న వారు ఇప్పుడు కూడా అదేపంథాను కొనసాగిస్తున్నారు. కొండపి నియోజకవర్గంలోని పాలేరు పరీవాహక ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని విచ్చలవిడిగా ఇసుకను కొల్లగొడుతున్నారు. దాన్ని ట్రాక్టర్‌లలో ఇతర ప్రాంతాలకు తరలించి ట్రక్కు రూ.4000కు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలోని వివిధ శాఖల సిబ్బందితో వారికి ఉన్న పాతపరిచయాలు కూడా కలిసొస్తున్నాయి. మండల కేంద్రమైన జరుగుమల్లితోపాటు చింతలపాలెం, చిర్రికూరపాడు, చతుకుపాడు, కామేపల్లి, పైడిపాడు, బిట్రగుంట గ్రామాల నుంచి రోజుకు వందల ట్రక్కుల ఇసుక ఇతర ప్రాంతాలకు తరలివెళ్తోంది. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టినప్పటికీ అంతా మా ఇష్టం అన్నట్లు వైసీపీ నేతలు బరితెగించి సాగిస్తున్న వ్యవహారాన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారు.

కూటమి ప్రభుత్వంలోనూ రెచ్చిపోతున్న వైసీపీ నేతలు

పాలేరు పరీవాహక ప్రాంతంలో

విచ్చలవిడిగా తవ్వకాలు

ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మకం

కలిసొచ్చిన పాత పరిచయాలు

కూటమి ప్రభుత్వంలోనూ వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఐదేళ్లుగా అడ్డగోలుగా ఇసుకను దోచుకున్న వారు ఇప్పుడు కూడా అదేపంథాను కొనసాగిస్తున్నారు. కొండపి నియోజకవర్గంలోని పాలేరు పరీవాహక ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని విచ్చలవిడిగా ఇసుకను కొల్లగొడుతున్నారు. దాన్ని ట్రాక్టర్‌లలో ఇతర ప్రాంతాలకు తరలించి ట్రక్కు రూ.4000కు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలోని వివిధ శాఖల సిబ్బందితో వారికి ఉన్న పాతపరిచయాలు కూడా కలిసొస్తున్నాయి. మండల కేంద్రమైన జరుగుమల్లితోపాటు చింతలపాలెం, చిర్రికూరపాడు, చతుకుపాడు, కామేపల్లి, పైడిపాడు, బిట్రగుంట గ్రామాల నుంచి రోజుకు వందల ట్రక్కుల ఇసుక ఇతర ప్రాంతాలకు తరలివెళ్తోంది. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టినప్పటికీ అంతా మా ఇష్టం అన్నట్లు వైసీపీ నేతలు బరితెగించి సాగిస్తున్న వ్యవహారాన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారు.

జరుగుమల్లి (కొండపి), సెప్టెంబరు 29 : ప్రభుత్వం మారినా ఇసుక అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్ట పడలేదు. గత వైసీపీ హయాంలో ఇసుకను దోచుకున్న వారే ఇప్పుడూ దందా సాగిస్తున్నారు. పాలేరు పరివాహక ప్రాంతంలో విచ్చలవిడిగా తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకొంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక బంగారమైంది. ఆపార్టీ నాయకులు నదులు, వాగుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు చేసి రవాణాను జోరుగా సాగించారు. అత్యధిక ధరకు అమ్ముకొని రూ.లక్షలు ఆర్జించారు. దీంతో భవన నిర్మాణదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. కొందరు పనులను నిలిపివేశారు. దీంతో కూలీలకు కూడా ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈనేపథ్యంలో కొద్దినెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం భవన నిర్మాణదారులకు ఇసుక కష్టాల నుంచి విముక్తి కల్పించడంతోపాటు కూలీలకు పనులు కల్పించాలన్న ఉద్దేశంతో ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించింది. దీంతో ఇసుక కష్టాలు తీరతాయని అందరూ ఆశించారు.

‘ఉచితం’లోనూ అనుచితం

ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని రూపొందించింది. అవసరమైన వారు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకొని నదుల నుంచి ఇసుకను ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పించింది. అయితే జిల్లాలో నదులు లేకపోవడంతో నెల్లూరు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది. స్థానిక అవసరాలకు ఎక్కడికక్కడ ఉన్న వనరుల నుంచి సమీప గ్రామాల ప్రజలు ఎడ్లబండ్ల ద్వారా ఇసుకను తీసుకెళ్లేందుకు అధికారులు అవకాశం ఇస్తున్నారు. అయితే ఎక్కడా ట్రాక్టర్‌లు, లారీల్లో ఇసుకను రవాణా చేసేందుకు వీలు లేదు. దీన్ని ఆసరా చేసుకొని మండలంలోని పలు గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు తిరిగి ఇసుక అక్రమ వ్యాపారాన్ని ముమ్మరం చేశారు. కొన్నిచోట్ల టీడీపీ నాయకులు కూడా దీన్ని సాగించేందుకు సిద్ధమవుతున్నా వారిని బెదిరిస్తున్నారు. గతం నుంచి అధికారులతో ఉన్న పరిచయాలతో టీడీపీ నాయకులను కట్టడి చేసి వైసీపీ వారే దందా సాగిస్తున్నారు. అక్కడక్కడా ఒకరిద్దరు టీడీపీ నాయకులు వైసీపీ నేతలను ఎదుర్కొని ఇసుక అక్రమ వ్యాపారంలోకి దిగుతున్నారు.


జరుగుమల్లి కేంద్రంగా జోరుగా వ్యాపారం

ప్రధానంగా జరుగుమల్లిలో గ్రామ ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. చింతలపాలెం, చిర్రికూరపాడు, చతుకుపాడు, కామేపల్లి, పైడిపాడు, బిట్రగుంట గ్రామాల నుంచి ఇసుక అక్రమ తరలింపు జరుగుతోంది. కొండపి, సింగరాయకొండ, టంగుటూరు మండలాల్లో అక్కడక్కడా చిన్నపాటి ఏరుల్లో ఇసుక ఉన్నా శ్లాబ్‌, ఇతర కట్టుబడి పనులకు పాలేరు ఇసుక నాణ్యతగా ఉంటుందన్న భావన నిర్మాణదారుల్లో ఉంది. దీంతో అవసరమైన వారు పాలేరు ఇసుక కావాలని అడుగుతుంటారు. దాన్ని వైసీపీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. ఆపనిలో అనుభవం ఉండటంతో ఇసుక ఎత్తే మనుషులు, ట్రాక్టర్లు వారివే ఉంటున్నాయి. ఇతరులను అక్కడికి రానివ్వకుండా తమ పరపతితో వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. పాలేరు నుంచి తరలించిన ఇసుకను సింగరాయకొండ, టంగుటూరు, కొండపి మండలాల్లోని గ్రామాల్లో ట్రక్కు రూ.4,000కు పైగా విక్రయిస్తున్నారు. ట్రాక్టర్‌కు ఎత్తేందుకు రూ.1,500, బాడుగ కింద దూరాన్ని బట్టి రూ.1,500 నుంచి 2000 వసూలు చేస్తున్నారు. మధ్యవర్తులు మరో రూ.500 నుంచి రూ.వెయ్యి అదనంగా తీసుకొని విక్రయిస్తున్నారు.

జరిమానాలు విధించారు.. వసూలు మరిచారు..

గత వైసీపీ ప్రభుత్వంలో ఆపార్టీ నాయకులు పాలేరును గుల్లచేశారు. విచ్చలవిడిగా ఇసుకను తవ్వారు. కొందరు ఏరును ఆనుకొని ఉండే పొలాలను కొనుగోలు చేసి ఈ వ్యవహారాన్ని సాగించారు. అయితే అక్కడక్కడా స్థానికుల ఫిర్యాదుతో మైనింగ్‌, ఎస్‌ఈబీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా జరుగుమల్లి, చతుకుపాడు గ్రామాల్లో అక్రమంగా ఇసుకనున తవ్వుతున్న కొందరు వైసీపీ నాయకులను గుర్తించి రూ.లక్షల్లో జరిమానాలు విధించారు. కానీ వారి నుంచి ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. ఆ నాయకులే ఇప్పుడు కూడా ఇసుక దందా కొనసాగిస్తుండటంపై అనేక విమర్శలు వస్తున్నాయి.

బతిమాలి వెళ్లారు.. తిరిగి తరలిస్తున్నారు

జరుగుమల్లి మండల తహసీల్దార్‌ జనార్దన్‌ గురువారం సాయంత్రం ఐదు ఇసుక ట్రాక్టర్లను ఆపి పోలీసు స్టేషన్‌కు తరలించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే పట్టుబడ్డవారు తామంతా రూ.10వేల జరిమానా కట్టలేమని, ఇకపై ఇలాంటి పనిచేయబోమని ప్రాథేయపడినట్లు సమాచారం. దీంతో తొలితప్పుగా భావించి ఇకపై ఇసుకను తరిలిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని తహసీల్దార్‌ హెచ్చరించి వారిని పంపించినట్లు తెలిసింది. అయితే శుక్రవారం నుంచి తిరిగి ట్రాక్టర్‌ల యజమానులు ఇసుక తరలింపును కొనసాగించారు. ప్రధానంగా మండలంలోని అన్ని పాలేరు పరివాహక గ్రామాల నుంచి చిర్రికూరపాడు మీదుగా కె.ఉప్పలపాడు చేరుకుని టంగుటూరు, కొండపి, జరుగుమల్లి మండలాల్లోని గ్రామాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా అధికారులు ఇసుక అక్రమ వ్యాపారంపై దృష్టిసారించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Sep 29 , 2024 | 11:46 PM