ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
ABN, Publish Date - Nov 27 , 2024 | 01:48 AM
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. విభిన్న వర్గాలు, రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, వివిధ ప్రజాసంఘాల నాయకులు ఈ వేడు కల్లో భాగస్వాములయ్యారు. జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతరచోట్ల రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించడంతోపాటు రాజ్యాంగ దినోత్సవ ప్రతి జ్ఞలు చేశారు.
అంబేడ్కర్‌కు నివాళులు, ప్రతిజ్ఞలు
ఒంగోలు, నవంబరు 26 (ఆంఽధ్రజ్యోతి) : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. విభిన్న వర్గాలు, రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, వివిధ ప్రజాసంఘాల నాయకులు ఈ వేడు కల్లో భాగస్వాములయ్యారు. జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతరచోట్ల రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించడంతోపాటు రాజ్యాంగ దినోత్సవ ప్రతి జ్ఞలు చేశారు. ప్రభుత్వపరంగా 2015 నుంచి భారత రాజ్యాంగ దినో త్సవాన్ని జరుపుకుంటున్నా ఈసారి వజ్రోత్సవం కావడంతో మరింత ఘనంగా నిర్వహించారు. జిల్లాకు చెందిన సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి పాల్గొన్నారు. అంతకు ముందు ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి తన చాంబర్‌లో అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు.
నివాళులర్పించిన కలెక్టర్, బీఎన్
ఒంగోలులోని అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్ తమీమ్ అన్సారియా, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రీవెన్స్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్, అధికారులు, ఉద్యోగులు రాజ్యాంగ ప్రమాణం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి ఎస్పీ ఏఆర్.దామోదర్ ఘనంగా నివాళులర్పించారు. వైసీపీ కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో జరగ్గా, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు షేక్ సైదా ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అలాగే జిల్లావ్యాప్తంగా వందలాది ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతర ప్రాంతాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Updated Date - Nov 27 , 2024 | 01:48 AM