ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అలరించిన సత్యహరిశ్చంద్ర

ABN, Publish Date - Nov 24 , 2024 | 11:10 PM

ఒకప్పుడు వినోదానికి పెట్టింది పేరుగా ఉన్న పౌరాణిక నాటకాలు చిత్ర పరిశ్రమ రాకతో క్రమేపీ ప్రాభవం తగ్గుతూ వచ్చాయి. నేటి తరం యువతకు పౌరాణిక నాటకాలు అంటే పుస్తకాలలో మాత్రమే చదువుకునే పరిస్థితి. దీంతో పౌరాణిక కళాకారులు కూడా పూర్తిగా తగ్గిపోయారు. అద్దంకి మాత్రం పౌరాణిక కళాకారులకు పెట్టింది పేరు.

రీడింగ్‌ రూమ్‌ ఆవరణలో ప్రదర్శిస్తున్న సత్యహరిశ్చంద్ర నాటకం

రాత్రంతా కదలకుండా తిలకించిన అభిమానులు

అద్దంకి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : ఒకప్పుడు వినోదానికి పెట్టింది పేరుగా ఉన్న పౌరాణిక నాటకాలు చిత్ర పరిశ్రమ రాకతో క్రమేపీ ప్రాభవం తగ్గుతూ వచ్చాయి. నేటి తరం యువతకు పౌరాణిక నాటకాలు అంటే పుస్తకాలలో మాత్రమే చదువుకునే పరిస్థితి. దీంతో పౌరాణిక కళాకారులు కూడా పూర్తిగా తగ్గిపోయారు. అద్దంకి మాత్రం పౌరాణిక కళాకారులకు పెట్టింది పేరు. నాటి తరం కళాకారులతో పాటు నేటి తరంలో కూడా కొద్దిమంది అప్పుడప్పుడూ పౌరాణిక కళా ప్ర దర్శనలు ఇస్తూ ప్రజలను రంజింప చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి అద్దం కి పట్టణంలోని భవానీ సెంటర్‌లో రీడింగ్‌ రూమ్‌ ఆవరణలో డోలక్‌ ఆర్టిస్ట్‌ కొమరిగిరి హనుమంతరావు సంతాప సభలో భాగంగా అద్దంకి పట్టణ రంగస్థల కళాకారుల ఆధ్వర్యంలో సత్యహరిశ్చంద్ర (వారణాసి సీను), దేవనర్తకి పూర్తి నాటకం ప్రదర్శన జరిగింది. పౌరాణిక నాటకాల ప్రదర్శన ఆదివా రం తెల్లవారే వరకు జరిగినా అభిమానులు కదలకుండా ఉండడం విశేషం. దీనిని బట్టి అద్దంకిలో పౌరాణిక నాటకాల పట్ల అభిమానుల ఆదరణ కొనసాగుతూనే ఉందనటానికి నిదర్శనంగా నిలిచింది. అదే సమయంలో ఇటీవల వరకు చెత్తాచెదారంతో నిండి ఉన్న రీడింగ్‌ రూమ్‌ ప్రాంగణం పౌరాణిక నాటకాల ప్రదర్శన పుణ్యా న బాగుపడింది. రంగస్థల కళాకారుడు ఆలకుంట శ్రీనివాసరావు, జనచైతన్య వేదిక కన్వీనర్‌ అన్నమనేని వెంకటరావు, మన్నం త్రిమూర్తులు, పమిడిఘంటం చంద్రశేఖర్‌, దామా హనుమంతరావు, పీసీహెచ్‌ కోటయ్య, తన్నీరు నాగేశ్వర రావు, చెన్నుపల్లి నాగేశ్వరరావు, వెలనాటి రామారావు హాజరయ్యారు.

Updated Date - Nov 24 , 2024 | 11:10 PM