ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నివేశన స్థలాల కోసం వివాదాలు సృష్టించుకోవద్దు

ABN, Publish Date - Mar 28 , 2024 | 12:22 AM

మత్స్యకారులు జగనన్న కాలనీ ఇంటి స్ధలాల విషయంలో వివాదాలు సృష్టించుకోవద్దని అధికారులు సూచించారు. కనపర్తి పం చాయతీ పరిధిలోని మేకల సోమయ్య పట్టపుపాలెం, బీచ్‌రోడ్‌ పట్టపుపాలెం గ్రా మాల మత్స్యకారుల మధ్య జగనన్న కాలనీ ఇంటి స్ధలాల పంపిణీ విషయంలో వివాదం నెలకొంది.

మత్స్యకారులకు అధికారుల సూచన

నాగులుప్పలపాడు మార్చి 27 : మత్స్యకారులు జగనన్న కాలనీ ఇంటి స్ధలాల విషయంలో వివాదాలు సృష్టించుకోవద్దని అధికారులు సూచించారు. కనపర్తి పం చాయతీ పరిధిలోని మేకల సోమయ్య పట్టపుపాలెం, బీచ్‌రోడ్‌ పట్టపుపాలెం గ్రా మాల మత్స్యకారుల మధ్య జగనన్న కాలనీ ఇంటి స్ధలాల పంపిణీ విషయంలో వివాదం నెలకొంది. బీచ్‌రోడ్‌ పట్టపుపాలెం మత్స్యకారులు లేఅవుట్‌లోకి వెళ్ళకుం డా ముళ్లకంచెలు వేయడంతో వివాదం రేగింది. దీంతో మేకల సోమయ్య పట్టపు పా లెంకు చెందిన మత్స్యకారులు ఎస్పీ పరమేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేయడంతో మంగళవారం అర్ధరాత్రి తహసీల్దార్‌ శ్రీనివాసరావు, రూరల్‌ సీఐ అజయ్‌కుమార్‌, ఎస్సై బ్రహ్మానాయుడు హుటాహుటిన అక్కడకు చేరుకొని ఇరు గ్రామాల మత్స్య కారులతో మాట్లాడి శాంతింపజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ శ్రీనివాసరా వు మాట్లాడుతూ మేకల సోమయ్య పట్టపుపాలెం, బీచ్‌రోడ్‌ పట్టపుపాలెం గ్రా మస్థులకు జగనన్న కాలనీలు నిర్మించేందుకు 72మందికి ఇంటి స్ధలాలను అందించేలా లేఅవుట్‌ను సిద్ధం చేశామన్నారు. అయితే 14 మందికి మాత్రమే గ తంలో పట్టాలు ఇచ్చారని, అర్హులైన ఇరు గ్రామాల మత్స్యకారులందరికీ స్థల ప ట్టాలు అందించేందుకు సిద్ధం ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున జాప్యం జరుగుతుందన్నారు. కోడ్‌ ముగిసిన వెంటనే అం దరికీ నివేశన స్థల పట్టాలు ఇస్తామని చెప్పారు. వివాదాస్పదంగా మారిన జగ నన్న కాలనీ లేఅవుట్‌లో ఎవరూ ప్రవేశించకుండా 145 సెక్షన్‌ అమలు చేస్తూ తహసీల్దార్‌ ఆదేశాలు జారీ చేశారు. సీఐ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ గ్రామా ల్లో శాంతిభద్రతల సమస్య సృష్టించవద్దని, సామరస్యంగా సమస్యను పరిష్కరి ంచుకోవాలన్నారు. అధికారులను సమన్వయం చేసుకుని శాంతియుతంగా సమ స్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

Updated Date - Mar 28 , 2024 | 12:22 AM

Advertising
Advertising