RGV: వర్మ అరెస్ట్‌కు రంగం సిద్దం..
ABN, Publish Date - Nov 25 , 2024 | 09:38 AM
Andhrapradesh: ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో వర్మపై కేసు నమోదు అయ్యింది. దీంతో విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొదటి సారి ఈనెల 19న వర్మ పోలీసుల ఎదుట విచారణకు రావాల్సి ఉండగా.. వారం రోజులు గడువు కావాలని కోరారు. వర్మ విజ్ఞప్తి మేరకు పోలీసులు వారం రోజులు గడువు ఇచ్చారు. దీంతో ఈరోజు మరోసారి ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రాంగోపాల్ వర్మ కేసు విచారణ జరగాల్సి ఉంది.
ప్రకాశం, నవంబర్ 25: డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Director Ram Gopal Varma) మరోసారి పోలీసు విచారణకు డుమ్మాకొట్టారు. ఈరోజు (సోమవారం) విచారణకు హాజరుకావడం లేదంటూ లాయర్ ద్వారా పోలీసులకు వర్మ సమాచారం పంపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేసులో రాంగోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
దీనికి సంబంధించి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో వర్మపై కేసు నమోదు అయ్యింది. దీంతో విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొదటి సారి ఈనెల 19న వర్మ పోలీసుల ఎదుట విచారణకు రావాల్సి ఉండగా.. వారం రోజులు గడువు కావాలని కోరారు. వర్మ విజ్ఞప్తి మేరకు పోలీసులు వారం రోజులు గడువు ఇచ్చారు. దీంతో ఈరోజు మరోసారి ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రాంగోపాల్ వర్మ కేసు విచారణ జరగాల్సి ఉంది. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని వర్మకు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసు ఇచ్చారు. అయితే ఈరోజు విచారణకు కూడా డైరెక్టర్ డుమ్మా కొట్టేశారు. విచారణకు హాజరుకావడం లేదంటూ తన లాయర్ శ్రీనివాస్‌కు వర్మ సమాచారం ఇచ్చారు. ఇదే విషయాన్ని లాయర్ పోలీసులకు తెలియజేశారు. అయితే వర్మ విచారణకు గైర్హాజరైన నేపథ్యంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఈ రాశి వారికి ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది.
కాగా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈనెల 10న ఏడు సెక్షన్లతో రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తనపై నమోదైన కేసు కొట్టేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. క్వాష్ పిటిషన్‌లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. పోలీసుల ముందు హాజరయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలన్న రామ్‌గోపాల్ వర్మ తరఫు న్యాయవాది అభ్యర్థననూ తోసిపుచ్చింది. ఈ తరహా అభ్యర్థనను సంబంధిత స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) వద్ద చేసుకోవాలని, కోర్టు ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని పేర్కొంది. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ముత్తనపల్లి రామలింగయ్యకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో రాంగోపాల్ వర్మ విచారణకు హాజరు కావడం అనివార్యమైంది.
ఇవి కూడా చదవండి...
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 25 , 2024 | 11:04 AM