టీడీపీలో కొనసాగుతున్న చేరికలు
ABN, Publish Date - Jan 29 , 2024 | 11:20 PM
టీడీపీలోకి చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర క్యాంప్ క్యాంపు నివాసంలో సోమవారం హనుమంతుపాడు మండలంలోని సీ తారాంపురం గ్రామానికి చెందిన 30 కుటుం బాలవారు వైసీపీని వీడారు. వారంతా సానికొమ్ము తిరుపతిరెడ్డి(ఎస్టీఆర్) ఆధ్వర్యంలో టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఉగ్ర సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఉగ్ర వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కనిగిరిలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందేలా కృషి చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు.
తురకపల్లిలో వైసీపీని వీడిన కుటుంబాలు
విజయానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర విజ్ఞప్తి
కనిగిరి, జనవరి 29: టీడీపీలోకి చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర క్యాంప్ క్యాంపు నివాసంలో సోమవారం హనుమంతుపాడు మండలంలోని సీ తారాంపురం గ్రామానికి చెందిన 30 కుటుం బాలవారు వైసీపీని వీడారు. వారంతా సానికొమ్ము తిరుపతిరెడ్డి(ఎస్టీఆర్) ఆధ్వర్యంలో టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఉగ్ర సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఉగ్ర వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కనిగిరిలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందేలా కృషి చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కనిగిరిలో భారీ మెజార్టీ వచ్చేలా పనిచేయాలని కోరారు. ఇంటింటికీ తిరుగుతూ ఆయా గ్రామాల్లోని సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి టీడీపీ చేపట్టబోయే చర్యలను, అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. అదేవిధంగా టీడీపీ గెలుపుతోనే కనిగిరి అభివృద్ధి సాధ్యపడుతుందని, వెలుగొం డ జలాలు కనిగిరి ప్రాంతంలోని అన్ని మండలాలకు రప్పించేలా అధినేత చంద్రబాబు చర్యలు తీసుకుంటారని ప్రజలకు చెప్పాల న్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి సముచి త స్థానం కల్పించడంతో పాటు పాత వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ పాత, కొత్త తేడా లేకుండా కలసి కట్టుగా పార్టీ గెలుపుకు సైనికుల్లా పని చేయాలన్నారు. వైసీపీని వీడి నూనె నారాయణయాదవ్ నేతృత్వం లో పార్టీలో చేరిన వారిలో నల్లబోతుల బాలు, పీవీ లక్ష్మణ్, ఎస్ అబ్దుల్ రహిమాన్, విలియ మ్స్, బీ ప్రవీణ్, కే గురుకిృష్ణ, బీ రమేష్, జుటికె విక్కీ, ఎస్‌కే రఫీ, అజయ్‌ప్రవీణ్, సీతారాంపురం గ్రామస్థులు పాల్గొన్నారు.
Updated Date - Jan 29 , 2024 | 11:20 PM