గుడ్‌మార్నింగ్ పేరుతో స్థలాలు కబ్జా
ABN, Publish Date - Nov 25 , 2024 | 11:08 PM
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉదయం ఐదు గంటలకే ప్రజలు నిద్రలో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ పేరుతో వెళ్లి ఖాళీ స్థలాలను గుర్తించి.. వాటిని స్వాహా చేశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు.
ధర్మవరం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉదయం ఐదు గంటలకే ప్రజలు నిద్రలో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ పేరుతో వెళ్లి ఖాళీ స్థలాలను గుర్తించి.. వాటిని స్వాహా చేశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక దిమ్మిల్ సెంటర్‌లోని ప్రధాన కాలువలో పూడిక తీసే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. కేతిరెడ్డి గుడ్ మార్నింగ్‌కు బదులు గుడ్ ఈవినింగ్ కార్యక్రమం చేసి ఉంటే రోడ్లపై ఉన్న ప్రజలు వివిధ సమస్యలపై ప్రశ్నించే వారన్నారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, మున్సిపల్‌సిబ్బంది, రాజకీయనాయకులే కాక ప్రజలు, విద్యార్థులు ఇందులో భాగస్వామ్యం కావాలని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్, ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు.
కార్తీక దీపం స్థూపం ఆవిష్కరణ
స్థానిక చెలిమి ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక దీపం స్థూపం ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఇందులో మంత్రి సత్య కుమార్‌యాదవ్, ఏపీ సీడ్స్ కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్ కమతం కాటమయ్య,, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పరిశే సుధాకర్, ఆలయ కమిటి గౌరవాధ్యక్షులు పల్లెం వేణు గోపాల్, గడ్డం పార్థసారధి, అధ్యక్షుడు బండారు శ్రీనివా సులు, ఉపాధ్యక్షుడు డీఎం సుందరేషన పాల్గొన్నారు.
తరగతి గదుల నిర్మాణానికి శ్రీకారం
బత్తలపల్లి : మండలంలోని సంజీవపురం కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో రూ..74.80 లక్షలతో అదనపు తరగతి గదులు, ప్రహరీ నిర్మాణానికి మంత్రి మంత్రి సత్యకుమార్ సోమవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహేష్, తహసిల్దార్ స్వర్ణలత, ఎంఈఓ చాముండేశ్వరి పాల్గొన్నారు.
Updated Date - Nov 25 , 2024 | 11:08 PM