ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బందరులో సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌ ప్రారంభం

ABN, Publish Date - Nov 21 , 2024 | 03:48 AM

కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ను రాష్ట్రమంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ, మాజీ ఎంపీ, ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు బుధవారం ప్రారంభించారు.

సినీనటులు పాయల్‌ రాజ్‌పుత్‌, నయన్‌ సారిక సందడి

మచిలీపట్నం టౌన్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ను రాష్ట్రమంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ, మాజీ ఎంపీ, ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినీనటులు పాయల్‌ రాజ్‌పుత్‌, నయన్‌ సారిక సందడి చేశారు. ఈ సందర్భంగా కొల్లు నీలిమ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో సీఎంఆర్‌ మాల్‌ రేట్లు ఉన్నాయన్నారు. కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ సీఎంఆర్‌లో నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరలకు లభిస్తున్నాయన్నారు. సీఎంఆర్‌ వ్యవస్థాపక చైర్మన్‌ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ తమ సంస్థను గత నాలుగు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. మచిలీపట్నంలో 37వ షోరూంను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. సీఎంఆర్‌ ఎండీ మావూరి మోహన్‌ మాట్లాడుతూ అన్ని రకాల వెరైటీలు, డిజైన్లు తమ షాపింగ్‌ మాల్‌లో లభిస్తాయన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 03:48 AM