ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఓం నమో భగవతే రుద్రాయ

ABN, Publish Date - Nov 25 , 2024 | 11:47 PM

ఓం నమో భగవతే రుద్రాయ.. నమస్తే రుద్రమన్య వ అంటూ కార్తీక మాస నాల్గవ సోమవారం శైవ క్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి.

నిమ్మనపల్లెలో స్వామివారికి బాహుదా నుంచి నీటిని తెస్తున్న వేదపండితులు

కార్తీక చివరి సోమవారం శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి ఆలయాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక శోభ

పెద్దతిప్పసముద్రం నవంబరు 25(ఆంద్రజ్యోతి): ఓం నమో భగవతే రుద్రాయ.. నమస్తే రుద్రమన్య వ అంటూ కార్తీక మాస నాల్గవ సోమవారం శైవ క్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. ఈ సందర్భంగా ఆలయాల్లో పరమశివుడికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతోపా టు విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి పూజలు చేయడంతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెళ్లివిరిసింది. పీటీఎం మండలంలోని రంగసము ద్రం, అంకిరెడ్డిపల్లె, పీటీఎం గ్రామాల్లో కార్తీమాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయా ల్లో విశే షపూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక వేత్త సనగరం పట్టాబిరామయ్య ఆధ్వర్యంలో పీటీఎంలో వెలసిన ప్రసన్న పార్వతీ సమేత విరూపాక్షేశ్వ రస్వామి ఆలయం విశేష పూజలు నిర్వహించారు. పీటీఎం ఆలయంలో ఉదయం 8గంటల నుంచి స్వామి వారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుధ్రా భిషేకం, రుధ్రహోమం, పుర్ణాహుతి నిర్వహించా రు. అలాగే రంగసముద్రంలో వెలసిన రామ లింగేశ్వర స్వామి ఆలయం, అంకిరెడ్డిపల్లెలో వెలసి న భైరవేశ్వరస్వామి ఆలయాల్లో విశేషపూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఆయా ఆలయాల్లో కార్తీక దీపోత్సవ ం నిర్వహించారు. ఆయా ఆలయాల్లో భక్తులు అదిక సంఖ్యలో పాల్గొని స్వామి వార్లను దర్శించుకున్నారు.

నేలమల్లేశ్వరస్వామి కుంభాభిషేకం

నిమ్మనపల్లి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): మండ లంలోని తవళం అటీవీ ప్రాంతం రుషిభూమిలో వెలసిన నేలమల్లేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం భక్తిశ్రధ్దలతో కుంభాభి షేకం నిర్వహించారు. ఈ సంధర్బంగా బాహుదా నది ప్రవాహం నుంచి వేద పండితులచే 101బిం దెలతో నీళ్లను తీసుకువచ్చి స్వామివారిని అభిషే కించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు ధర్శనభాగ్యం కల్పించారు. కార్యక్రమాలను మదనపల్లి శ్రీకృష్ణ గ్రూప్‌ అధినేత మూర్పూరి శశిధర్‌రావు కుంటుంబ సభ్యులు నిర్వహించారు. ఆలయాని వచ్చి భక్తలకు అన్న దానం ఏర్పాటు చేసినట్లు ఏవో మంజుల, తాత్కాలిక కమిటీ చైర్మన రామకృష్ణ తెలిపారు.

వైభవంగా కార్తీక దీపోత్సవం

మదనపల్లెఅర్బన, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): కార్తీకమాసం నాలుగో సోమవారం మదనపల్లె పట్టణంలోని పలు ఆలయాల్లో కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చిప్పిలి గ్రామంలోని మడికయ్యల శివాలయంలో, దేవళంవీధిలోని సోమేశ్వరస్వామిఆలయంలో, నీరు గట్టువారిపల్లె చౌడేశ్వరీ సర్కిల్‌లోని నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో, సీటీఎం రోడ్డులోని మంజునా థస్వామి ఆలయంలో శివుడికి రుద్రాభిషేకం నిర్వ హించారు. అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. సాయం త్ర సంధ్యావేళ అన్ని ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి పూజలు నిర్వహించారు. మంజునాథ స్వామి ఆలయంలో ఆలయకమిటీ, నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఆలయధర్మకర్త గుడిరామాం జులు, మడికయ్యల శివాలయంలో ఆలయప్రధాన అర్చకుడు విశ్వేశ్వరప్రసాద్‌, సోమేశ్వరస్వామి ఆల యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఫణీంద్ర కుమార్‌లు కార్యక్రమాలను పర్యవేక్షించారు.

భక్తిశ్రద్ధలతో కేదారేశ్వర వ్రతాలు

కలకడ, నవంబరు 25(ఆంధ్రజ్యోతి):కార్తీక నాలుగ వ సోమవారం పురస్కరించుకుని కలకడ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో కేదారేశ్వర వ్రతాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గౌరమ్మకు పూజలు చేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతా ల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసా దాలను అందజేశారు. సాయంత్రం మహిళలు ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించారు.

Updated Date - Nov 25 , 2024 | 11:47 PM