ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nakka Anand Babu: వారికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి

ABN, Publish Date - Feb 11 , 2024 | 12:35 PM

గుంటూరులో డయేరియాతో మృతి చెందిన శారద కాలనీకి చెందిన పద్మ మృతదేహానికి మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, టీడీపీ నేతలు నసీర్ అహమ్మద్ , కనపర్తి శ్రీనివాసరావు, యల్లావుల అశోక్ తదితరులు నివాళులు అర్పించి.. ఆమె కుటుంబాన్ని పరామర్శించి నివాళులు అర్పించారు.

గుంటూరు: గుంటూరులో డయేరియాతో మృతి చెందిన శారద కాలనీకి చెందిన పద్మ మృతదేహానికి మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, టీడీపీ నేతలు నసీర్ అహమ్మద్ , కనపర్తి శ్రీనివాసరావు, యల్లావుల అశోక్ తదితరులు నివాళులు అర్పించి.. ఆమె కుటుంబాన్ని పరామర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. గుంటూరు నగరంలో కలుషిత మంచినీటి సరఫరా వల్ల ఇప్పటికే ఇద్దరు చనిపోయారన్నారు. అనేక మంది డయేరియాతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారన్నారు.

ప్రైవేట్ హాస్పిటల్లో, ఆర్ఎంపీల వద్ద వందలాది మంది చికిత్స తీసుకోంటున్నారన్నారు. ఐటీడీఏ కాలనీకి చెందిన ఓబులేసు, శారద కాలనీకి చెందిన పద్మ ఇద్దరూ డయేరియాతో మరణించారన్నారు. దళితులు, గిరిజనులు నివసించే ప్రాంతాలపై మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని నక్కా ఆనంద్ బాబు అన్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి చనిపోయిన కుటుంబాలకి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. వెంటనే గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి పైపులు అన్నిటినీ బాగు చేసి రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని నక్కా ఆనంద బాబు పేర్కొన్నారు.

Updated Date - Feb 11 , 2024 | 12:36 PM

Advertising
Advertising