విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఎంపీ వేమిరెడ్డి
ABN, Publish Date - Oct 27 , 2024 | 03:19 AM
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ చైర్మన్‌గా ఏర్పాటైన ‘కన్సల్టేషన్ కమిటీ ఫర్ ఎక్స్‌టర్నల్ ఎఫైర్స్’ సభ్యుడిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఎంపికయ్యారు.
నెల్లూరు(హరనాథపురం), అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ చైర్మన్‌గా ఏర్పాటైన ‘కన్సల్టేషన్ కమిటీ ఫర్ ఎక్స్‌టర్నల్ ఎఫైర్స్’ సభ్యుడిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఎంపికయ్యారు. ఈ కమిటీకి 10 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ ఎంపీలు ఎంపికవగా.. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి వేమిరెడ్డి ఒక్కరే స్థానం సంపాదించారు. విదేశాంగవిధానాలు, కార్యక్రమాలు, పథకాలపై ఈ కమిటీ చర్చిస్తుంది. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన కేంద్ర ప్రభుత్వానికి వేమిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Oct 27 , 2024 | 03:19 AM