ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్‌ను జీవిత కాలం జైల్లో పెట్టినా తప్పులేదు

ABN, Publish Date - Nov 15 , 2024 | 03:08 AM

గత ప్రభుత్వంలో రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణం కోసం వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని, అక్రమాలన్నీ కళ్ల ముందే కనబడుతున్నందున మాజీ సీఎం జగన్‌ను జీవిత కాలం జైల్లో పెట్టినా తప్పులేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అన్నారు.

రుషికొండ ప్యాలెస్‌కు ప్రజాధనం దుర్వినియోగం

విచారణ జరిపించాలి: విష్ణుకుమార్‌ రాజు

అది జగన్‌ రాజకీయ సమాధి: రఘురామ

ప్రత్యేకంగా చర్చిద్దాం: స్పీకర్‌ అయ్యన్న

అమరావతి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణం కోసం వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని, అక్రమాలన్నీ కళ్ల ముందే కనబడుతున్నందున మాజీ సీఎం జగన్‌ను జీవిత కాలం జైల్లో పెట్టినా తప్పులేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అన్నారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రుషికొండ ప్యాలె్‌సపై చర్చ జరిగింది. రుషికొండపై విలాసవంతమైన భవన సముదాయాలు, గృహోపకరణాలు, పచ్చదనం, మొక్కలు, దీపాలంకరణ, రహదారులు, భద్రత ఏర్పాట్లకు చేసిన ఖర్చు వివరాలు తెలియజేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, ఆదినారాయణరెడ్డి అడిగిన ప్రశ్నకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ సమాధానమిచ్చారు. ఏపీటీడీసీ ఆధ్వర్యంలో రుషికొండపై పాత రిసార్టు స్థానంలో 4,30,373 చదరపు అడగుల విస్తీర్ణంలో 7 బ్లాకులుగా నిర్మించిన రిసార్టుకు మొత్తం 409.39 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. దీనిపై విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ... గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టు వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. ప్రజలకు, రాజకీయ నాయకులకు కూడా తెలియనీయకుండా నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ వెనుక ఉన్న చిదంబర రహస్యంపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ‘అత్యంత విలాసవంతమైన రుషికొండ ప్యాలె్‌సకు ప్రజల సొమ్ము రూ.వందల కోట్లు దుర్వినియోగం చేశారు. అందులో భారీ దోపిడీ జరిగింది. ప్యాలెస్‌ లోపలకు వెళితే విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి.

రూ.1.80 లక్షలతో పేదలకు ఇళ్లను నిర్మిస్తుండగా.. రుషికొండ ప్యాలె్‌సలో బాత్‌రూమ్‌లోని కమోడ్‌కు రూ.11,46,84, బాత్‌టబ్‌కు రూ.12,38,763.. ఇలా చెబుతూ పోతే ఒక్క బాత్‌రూమ్‌లోని పరికరాలకే లక్షలు ఖర్చు పెట్టారు. రుషికొండపై జగన్‌ కోసం నిర్మించిన ప్యాలె్‌సకు చేసిన ఖర్చు.. పేదలకు నిర్మిస్తున్న 22,743 ఇళ్లతో సమానం. అస్మదీయులకు కాంట్రాక్టులు ఇచ్చి ప్రజాధనాన్ని దోపిడీ చేశారు. ఇది చరిత్రలో అతి పెద్ద ఆర్థిక కుంభకోణం. ఏమీ లేని స్కిల్‌ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టించి జగన్‌ మానసిక క్షోభకు గురిచేశారు. రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణంలో అక్రమాలన్నీ కళ్ల ముందే కనబడుతున్నందున మాజీ సీఎం జగన్‌ను జీవిత కాలం జైల్లో పెట్టినా తప్పులేదు’ అని విష్ణుకుమార్‌రాజు అన్నారు. టీడీపీ సభ్యుడు రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ.. ‘రూ.500 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి రుషికొండపై జగన్‌ కట్టుకున్నది ఇల్లు కాదు.. ఆయన రాజకీయ సమాధి’ అని ఎద్దేవా చేశారు. రుషికొండ ప్యాలె్‌సపై తాను వేసిన కేసును ఉపసంహరించుకుంటానని తెలిపారు. దీనిపై ప్రత్యేకచర్చకు సోమవారం సభలో సమయం కేటాయిస్తానని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చెప్పారు. దీంతో చర్చను తాత్కాలికంగా ముగించారు.

Updated Date - Nov 15 , 2024 | 03:08 AM